Indira Mahila Shakti | నిరుపేద మహిళలు ఆర్థికంగా స్థిరపడడమే ప్రభుత్వ లక్ష్యం: బొబ్బిలి రామకృష్ణ

నిరుపేద మహిళలు ఆర్థికంగా స్థిరపడడమే ప్రభుత్వ లక్ష్యమని డీసీసీ కార్పొరేషన్​ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఇందూరు: Indira Mahila Shakti | నిరుపేద మహిళలు ఆర్థికంగా స్థిరపడడమే ప్రభుత్వ లక్ష్యమని డీసీసీ కార్పొరేషన్​ అధ్యక్షుడు బొబ్బిలి రామకృష్ణ అన్నారు. ప్రభుత్వ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ (Minority Finance Corporation) ఆధ్వర్యంలో ‘ఇందిరా మహిళా శక్తి’ పథకం కింద జిల్లాలో అర్హులైన మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమాన్ని న్యాక్​ సెంటర్​లో నిర్వహించారు.

Indira Mahila Shakti | స్వయం ఉపాధితో పైకి రావాలని..

బొబ్బిలి రామకృష్ణ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా(Nizamabad) మొత్తం రూ.1.02 కోట్ల వ్యయంతో 1,700 కుట్టు మిషన్లను పంపిణీ చేస్తున్నామన్నారు. అందులో నిజామాబాద్ అర్బన్ (Nizamabad urban) (పట్టణ) నియోజకవర్గానికి 500 కుట్టు మిషన్లను కేటాయించి అర్హులైన లబ్ధిదారులకు అందించామన్నారు. మైనారిటీ, నిరుపేద మహిళలు కుట్టుపని ద్వారా స్వయం ఉపాధి పొంది, ఆర్థికంగా స్థిరపడాలనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ ఉచిత కుట్టు మిషన్ల పంపిణీని చేపట్టిందని తెలిపారు.

Indira Mahila Shakti | అర్హులు వీరే..

ఈ పథకం కింద ఉచిత కుట్టు మిషన్ పొందాలనుకునే మహిళలు ఆన్‌లైన్ పోర్టల్ (tgobmms.cgg.gov.in) ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందన్నారు. దరఖాస్తుదారులు 18 నుండి 55 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలని తెలిపారు. కుట్టుపనిలో శిక్షణ పొందిన సర్టిఫికెట్ (ట్రైనింగ్ సర్టిఫికెట్) తప్పనిసరి ఉండాలని..వార్షిక ఆదాయం పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల కంటే తక్కువ ఉన్నవారే అర్హులని వివరించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు భోజన్న, కరీం, కోఆప్షన్ సభ్యులు నరేందర్ సింగ్, ఖైసర్, అంతరెడ్డి విజయపాల్ తదితరులు పాల్గొన్నారు.

suri3

ఇది కూడా చదవండి: ఉన్నతాధికారులతో సీఎం రేవంత్​రెడ్డి స‌మీక్ష 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *