Telangana Police Recruitment | 5 వేల పోలీస్​ ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం గ్రీన్​ సిగ్నల్​.. అభ్యర్థులకు అలర్ట్​

పోలీస్ శాఖలో 5 వేల ఉద్యోగాలను భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Telangana Police Recruitment | రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్​ న్యూస్​ చెప్పింది. పోలీస్ శాఖ (Police Department)లో 5 వేల ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఆమోదం తెలిపింది. దీంతో రెండు మూడు రోజుల్లో నోటిఫికేషన్​ వెలువడే అవకాశం ఉంది.

రాష్ట్రంలో కాంగ్రెస్​ ప్రభుత్వం (Congress Government) వచ్చిన తర్వాత పోలీస్​ ఉద్యోగాలు భర్తీ చేయలేదు. దీంతో అభ్యర్థులు ఎంతో ఆశగా కొలువుల కోసం సిద్ధం అవుతున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం తాజాగా 5 వేల పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపింది. అర్హతలు, వయోపరిమితులు, ఎంపిక విధానం, పరీక్షల షెడ్యూల్​ను త్వరలో విడుదల చేయనుంది. రెండో విడతలో మరో రెండు వేల కొలువులను భర్తీ చేస్తామని ప్రభుత్వం తెలిపింది.

Telangana Police Recruitment | పోస్టుల వివరాలు..

ప్రభుత్వం భర్తీ చేయనున్న పోలీస్​ కొలువుల్లో సివిల్​ కానిస్టేబుల్ 3,697, ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ కానిస్టేబుల్‌ 1,052, సబ్‌ఇన్‌స్పెక్టర్‌ (సివిల్‌)-148, సబ్‌ఇన్‌స్పెక్టర్‌ (ఏఆర్​)-14, రిజర్వ్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్ (టీజీఎస్పీ) – 12 పోస్టులు ఉన్నాయి. సబ్‌ ఇన్‌స్పెక్టర్ (ఏఆర్‌ సీపీఎల్‌) – 3, అసిస్టెంట్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్‌ (ఎఫ్‌పీబీ) – 23, పోలీసు కానిస్టేబుల్‌ (ఎస్‌ఏఆర్‌ సీపీఎల్‌) – 24, పోలీసు కానిస్టేబుల్‌ (డ్రైవర్‌-పీటీవో) – 20, మెకానిక్‌ పీటీవో – 7 పోస్టులను భర్తీ చేస్తామని తెలిపింది. స్పీఎఫ్, జైళ్లశాఖ, అగ్నిమాపక శాఖలకు సంబంధించి మరో 2 వేల పోస్టుల భర్తీకి త్వరలో ఆమోదం తెలపనుంది.

Telangana Police Recruitment | వీటిని మర్చిపోవద్దు

Telangana Police Recruitment

దాదాపుగా 4 ఏళ్ల తర్వాత పోలీస్ శాఖలో కొలువులు భర్తీ చేయనుండటంతో లక్షలాది మంది దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. అయితే అభ్యర్థులు పలు జాగ్రత్తలు పాటించాలని నిపుణులు చెబుతున్నారు. అభ్యర్థుల్లో కొంతమంది పూర్తిగా ఫిజికల్​ టెస్ట్​లపై ఫోకస్​ పెడుతుండగా.. కొందరు రాత పరీక్షపై దృష్టి సారిస్తున్నారు. మొదట ప్రిలిమినరీ పరీక్ష ఉంటుంది. అనంతరం ఫిజికల్ టెస్ట్​, అందులో ఉత్తీర్ణత సాధించిన వారికి మెయిన్స్​ పరీక్ష నిర్వహిస్తారు. అయితే చాలా మంది అభ్యర్థులు ఫిజికల్ టెస్ట్​ల్లో ఫెయిల్ అవుతుంటారు. ఈ క్రమంలో ఇప్పటి నుంచే సాధన చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. పౌష్టికాహారం తీసుకుంటూ నిత్యం ప్రాక్టీస్​ చేస్తే ఫిజికల్​ టెస్ట్​లో విజయం సాధించవచ్చని చెబుతున్నారు.

ఇది కూడా చదవండి..: Kavitha Party Name | కవిత పార్టీకి ఈసీ షాక్​.. పేరు మార్చుకోవాలని లేఖ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *