అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kavitha Party Name | తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీకి కొత్త చిక్కులు వచ్చాయి. పార్టీ పేరు మార్చుకోవాలని ఎన్నికల సంఘం పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితకు లేఖ రాసింది.
బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ అయిన అనంతరం కొన్ని రోజులు జాగృతి ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించిన కవిత (Kalvakuntla Kavitha).. అనంతరం సొంతంగా రాజకీయ పార్టీని ఏర్పాటు చేశారు. తొలుత పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సేనగా ప్రకటించారు. అయితే ఎన్నికల సంఘం తెలంగాణ రక్షణ సేన అని పెట్టుకోవాలని సూచించింది. ఈ మేరకు పార్టీ పేరును మార్చారు.
Kavitha Party Name | అభ్యంతరాలు రావడంతో..
కవిత పార్టీ పేరుపై అనేక అభ్యంతరాలు వచ్చాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ అని ఉండటంతో బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో ఎన్నికల సంఘం (Election Commission) కవితకు లేఖ రాసింది. పార్టీ పేరు మార్చుకోవాలని స్పష్టం చేసింది. 15 రోజుల్లో మూడు ప్రత్యామ్నాయ పేర్లు ఇవ్వకపోతే పార్టీ దరఖాస్తును మూసివేస్తామని పేర్కొంది.
Kavitha Party Name | న్యాయపోరాటానికి సిద్ధం

కవిత పార్టీ రిజిస్ట్రేషన్‌కు ప్రస్తుతం పేరు వివాదంతో అడ్డంకులు వచ్చాయి. కొత్త పేర్లతో మళ్లీ దరఖాస్తు చేయాలని ఈసీ సూచించింది. ఈ వ్యవహారంపై పార్టీ అధ్యక్షురాలు కవిత స్పందించారు. తమకు ఈసీ నుంచి వచ్చిన అభ్యంతరాలకు సమాధానం ఇచ్చామన్నారు. అయితే కొత్త పేర్లు ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. ఈసీ తమ దరఖాస్తును మూసి వేస్తే న్యాయపోరాటానికే సిద్ధమని తెలిపారు.
ఇది కూడా చదవండి..: Revanth Reddy Journey | జెడ్పీటీసీ నుంచి సీఎం వరకు.. రేవంత్‌రెడ్డి 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం