Revanth Reddy Journey | జెడ్పీటీసీ నుంచి సీఎం వరకు.. రేవంత్​రెడ్డి 20 ఏళ్ల రాజకీయ ప్రస్థానం

సీఎం రేవంత్​రెడ్డి తన రాజకీయ జీవితంలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. తనను తొలిసారి జెడ్పీటీసీగా గెలిపించిన మిడ్జిల్​లో ఆయన నేడు పర్యటించనున్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Revanth Reddy Journey | సీఎం రేవంత్​రెడ్డి తన రాజకీయ జీవితంలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ఎమోషనల్‌ ట్వీట్ చేశారు.లక్షల అక్షరాలతో రాసినా.. కోట్ల పదాలను కూర్చి చెప్పినా.. తరగని మధుర జ్ఞాపకం ఈ రెండు దశాబ్దాల ప్రజా జీవితం అని పేర్కొన్నారు.

మిడ్జిల్​లో రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)గా మొదలై.. నేడు అందరి గుండెల్లో “రేవంతన్న”గా నిలిచే వరకు సాగిన ఈ అద్భుత ప్రయాణం తన జీవితంలో ప్రత్యేక అధ్యాయం అని సీఎం పేర్కొన్నారు. ప్రజల ఆశీర్వాదంతో భవిష్యత్తులో తెలంగాణ పునర్ నిర్మాణ శ్రామికుడిగా,ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే సేవకుడిగా పని చేస్తానన్నారు.

Revanth Reddy Journey | నేడు మిడ్జిల్లో సీఎం సభ

జడ్చర్ల నియోజకవర్గంలో సీఎం రేవంత్‌ రెడ్డి శనివారం పర్యటించనున్నారు. మిడ్జిల్‌, ఊరుకొండ మండలాల్లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం మిడ్జిల్‌లో కృతజ్ఞత సభలో మాట్లాడారు. 2006 జులై 4న రేవంత్​రెడ్డి మిడ్జిల్‌ ZPTCగా గెలిచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. ప్రజా ప్రతినిధిగా తన తొలి అడుగుకు అండగా నిలిచిన మిడ్జిల్‌ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Revanth Reddy Journey | స్వతంత్ర అభ్యర్థిగా..

రేవంత్​రెడ్డి విద్యార్థి దశలో ఏబీవీపీలో కొనసాగారు. 2006లో స్వతంత్ర అభ్యర్థిగా జెడ్పీటీసీగా పోటీ చేసి గెలిచారు. 2007 ఇండిపెండెంట్​గా పోటీ చేసి ఎమ్మెల్సీ అయ్యారు. అనంతరం ఆయన టీడీపీలో చేరారు. 2009లో కొడంగల్ ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2014లో మరోసారి గెలుపొందారు. రాష్ట్రంలో టీడీపీ కనుమరుగు కావడం, ఆ పార్టీ ఎమ్మెల్యేలు చాలా మంది బీఆర్​ఎస్​లో చేరడంతో రేవంత్​రెడ్డి 2017లో కాంగ్రెస్​లో చేరారు. 2018లో ఆ పార్టీ నుంచి కొడంగల్​లో పోటీ చేసి ఓడిపోయారు.

Revanth Reddy Journey | వరించిన అదృష్టం

Revanth Reddy Journey

రేవంత్​రెడ్డి 2018 ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే ఓటమితో కుంగిపోకుండా.. బీఆర్​ఎస్​పై పోరాటం చేశారు. ఈ క్రమంలో అధిష్టానం ఆయనకు 2019లో మల్కాజ్​గిరి ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇచ్చింది. ఈ ఎన్నికల్లో విజయం సాధించిన ఆయనకు అదృష్టం సైతం కలిసి వచ్చింది. అనంతరం రాజకీయ పరిణామాల్లో రేవంత్​రెడ్డి పీసీసీ అధ్యక్షుడు అయ్యారు. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్​ పార్టీ (Congress Party) గెలుపు కోసం తీవ్రంగా కృషి చేశారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్​ మెజారిటీ సీట్లు సాధించడంతో సీఎం అభ్యర్థిగా అధిష్టానం రేవంత్​రెడ్డిని ప్రకటించింది. కాంగ్రెస్​ పార్టీలో ఇతర నాయకులను కలుపుకొని ఆయన రెండున్నరేళ్ల పాలన పూర్తి చేశారు.

ఇది కూడా చదవండి..: Telangana Heavy Rains | నేడు భారీ వర్ష సూచన

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *