Telangana Heavy Rains | నేడు భారీ వర్ష సూచన

రాష్ట్రంలో శనివారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Telangana Heavy Rains | రాష్ట్రంలో శనివారం మోస్తరు నుంచి భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

తెలంగాణ (Telangana)లోని ఆదిలాబాద్​, నిర్మల్​, నిజామాబాద్​, జగిత్యాల, మంచిర్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, భూపాలపల్లి, కామారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతాయి. మిగతా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురుస్తాయి. బలమైన అల్ప పీడన ప్రభావంతో 60 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయి.

Telangana Heavy Rains | ముసురు వాన

Telangana Heavy Rains

అల్ప పీడన ప్రభావంతో తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం సాయంత్రం నుంచి పలు జిల్లాల్లో ముసురు వాన పడుతోంది. శనివారం ఉదయం నుంచి ముసురు పెట్టడంతో పాటు, చలిగాలులు వీస్తున్నాయి. మరోవైపు వర్షాలు పడుతుండటంతో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. వర్షాల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు. సీజనల్​ వ్యాధులు ప్రబలే అవకాశం ఉండటంతో నివారణ చర్యలు తీసుకోవాలన్నారు.

ఇది కూడా చదవండి..: DGP Anand Review | ప్రజల్లోనే పోలీసులు ఉండాలి.. క్యాంపు కార్యాలయాలకు పరిమితం కావొద్దు: డీజీపీ డా. జితేందర్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *