Konda Surekha Show Cause | సీఎం రేవంత్ విదేశీ పర్యటన తర్వాతే మాట్లాడతా: కొండా సురేఖ

కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసుల వివాదంపై మంత్రి కొండా సురేఖ స్పందించారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Konda Surekha Show Cause | కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసుల వివాదంపై మంత్రి కొండా సురేఖ స్పందించారు. ఈ అంశంపై తాను చెప్పాల్సింది క్రమశిక్షణ కమిటీకి స్పష్టంగా తెలియజేశానని, ప్రస్తుతానికి ఈ విషయంపై మీడియాతో మాట్లాడబోనని ఆమె స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి  ( Revanth Reddy ) విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాత ఈ అంశంపై మాట్లాడుతానని ఆమె తెలిపారు.

Konda Surekha Show Cause | కుమార్తె వ్యాఖ్యలపై వివాదం..

ఇటీవల వరంగల్ జిల్లా గీసుకొండలో జరిగిన ఒక కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర దుమారం రేపాయి. నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు, ఆరోపణలు చేయడంతో ఈ అంశం కాంగ్రెస్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిని తీవ్రమైన క్రమశిక్షణా రాహిత్యంగా భావించిన పార్టీ అధిష్టానం, క్రమశిక్షణ కమిటీ ద్వారా మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

Konda Surekha Show Cause | వ్యక్తిగత వ్యాఖ్యలంటూ వివరణ..

పార్టీ జారీ చేసిన నోటీసుకు స్పందించిన కొండా సురేఖ.. క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌కు తన వివరణ పంపారు. తన కుమార్తె సుస్మిత చేసిన వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగతమని, ఆ విషయానికి తనను బాధ్యురాలిని చేయవద్దని ఆమె ఆ వివరణలో కోరినట్లు సమాచారం. అయితే సీఎంపై వచ్చిన విమర్శలను పార్టీ వర్గాలు తీవ్రంగా పరిగణించడంతో, నోటీసులతో పాటు తదుపరి చర్యలపై కూడా అధిష్టానం దృష్టి సారించినట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

ఇది కూడా చదవండి:  NSUI Leaders Suspension | ఎన్​ఎస్​యూఐ నాయకులపై సస్పెన్షన్​ రద్దు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *