అక్షరటుడే వెబ్‌డెస్క్: E20 Petrol | భారత్‌లో ఈ20 (E20) పెట్రోల్ వాడకంపై ప్రజల్లో నెలకొన్న సందేహాలకు కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ( Nitin Gadkari ) రాజ్యసభలో స్పష్టతనిచ్చారు. ఈ ఇంధనం వల్ల పాత వాహనాల ఇంజిన్లలో ఎలాంటి పెద్ద మార్పులు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. అయితే, కొన్ని నిర్దిష్ట మోడల్స్‌లోని చిన్నపాటి విడిభాగాలను మార్చాల్సి ఉంటుందని వెల్లడించారు. ఏప్రిల్ 1, 2005 నుంచి 2016 వరకు తయారైన బీఎస్-III (BS-III) వాహనాల్లో ఈ20 పెట్రోల్ వాడినప్పుడు కొన్ని రబ్బర్ విడిభాగాలు, గాస్కెట్లు దెబ్బతినే అవకాశం ఉందని గడ్కరీ తెలిపారు. అయితే, వాహన సాధారణ సర్వీసింగ్ (Routine Servicing) సమయాల్లో వీటిని సులభంగా మార్చుకోవచ్చని ఆయన సూచించారు.
E20 Petrol | పరిశోధనల స్పష్టీకరణ..
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL), ఐఐపీ డెహ్రాడూన్, సియామ్ (SIAM), ఏఆర్‌ఏఐ (ARAI) వంటి ప్రముఖ సంస్థలు సంయుక్తంగా ఈ ఇంధనంపై విస్తృత పరిశోధనలు జరిపాయి. కార్లు, బైక్‌ల ఇంజిన్లలో ఎలాంటి మార్పులు చేయాల్సిన అవసరం లేదని ఈ అధ్యయనాల్లో తేలిందని మంత్రి ప్రస్తావించారు. ఇథనాల్ కలపడం వల్ల వాహనాల పనితీరు, స్టార్టింగ్ సిస్టమ్, అలాగే మెటల్, ప్లాస్టిక్ విడిభాగాలపై ఎలాంటి ప్రతికూల ప్రభావం పడలేదని స్పష్టమైందన్నారు.
E20 Petrol | మైలేజ్ ఆందోళనలపై క్లారిటీ..
ఈ20 పెట్రోల్ వాడకం వల్ల మైలేజ్ తగ్గుతుందనే ప్రచారంపై మంత్రి స్పందిస్తూ.. మైలేజ్ అనేది పలు అంశాలపై ఆధారపడి ఉంటుందని, కేవలం ఇథనాల్ ఇంధనం వల్ల మాత్రమే మైలేజ్ మారదని వాహన తయారీదారులు, టెస్టింగ్ ఏజెన్సీలు తేల్చిచెప్పాయని పేర్కొన్నారు. అన్ని రకాల ల్యాబ్ పరీక్షలు, డ్యూరబిలిటీ ట్రయల్స్‌ను సైంటిఫిక్‌గా పూర్తి చేసిన తర్వాతే కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా దశలవారీగా ఈ20 ఇంధన కార్యక్రమాన్ని అమలు చేసిందని రాజ్యసభకు వివరించారు.
ఇది కూడా చదవండి: Kamareddy Rainfall | కామారెడ్డిలో విస్తారంగా వర్షాలు.. ఊపందుకున్న సాగు పనులు