అక్షరటుడే, వెబ్‌డెస్క్ : KOSPI Crash | సౌత్ కొరియాకు చెందిన ప్రధాన స్టాక్ మార్కెట్ (Stock Market) సూచీ కోస్పీ సుమారు రెండేళ్లుగా అద్భుతమైన పనితీరును కనబరుస్తోంది. ప్రధానంగా ఏఐ సంబంధిత టెక్ స్టాక్స్‌లో ర్యాలీతో ఇన్వెస్టర్లు భారీగా లాభాలను పొందారు. అయితే ఇటీవలి కాలంలో చైనానుంచి పోటీ ఎదురవుతుండడం, చిప్ కంపెనీలు భారీ ర్యాలీ చేసి ఉండడంతో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు దిగుతుండడంతో కోస్పీ కుదేలవుతోంది.
KOSPI Crash | ట్రేడింగ్ నిలిపివేసి..
కోస్పీ మంగళవారం నాటి ట్రేడింగ్‌లో 11 శాతం దిగజారింది. దీంతో కొంత సేపు ట్రేడింగ్ నిలిపివేశారు. బుధవారం సైతం పతనం కొనసాగింది. ఒక దశలో 12 శాతం వరకు పడిపోవడంతో మళ్లీ ట్రేడింగ్‌ను సుమారు 20 నిమిషాల పాటు నిలిపివేయాల్సి వచ్చింది. తర్వాత కొంత కోలుకుని 3,723 పాయింట్ల వద్ద స్థిరపడింది. కాగా 2000 సంవత్సరం కోస్పిలో విధించిన 15 సర్క్యూట్ బ్రేకర్లలో.. తొమ్మిది ఈ సంవత్సరమే సంభవించడం గమనార్హం.
KOSPI Crash | గరిష్టాలనుంచి..
జూన్‌లో కోస్పీ ఇండెక్స్ 9,386 వద్ద జీవనకాల గరిష్టాన్ని తాకింది. ప్రాఫిట్ బుకింగ్‌తో అక్కడినుంచి పతనం ప్రారంభమైంది. బుధవారం 5,663 పాయింట్ల వద్ద ముగిసింది. అంటే 3,723 పాయింట్లు కోల్పోయిందన్నమాట. కోస్పీ జీవన కాల గరిష్టాలనుంచి కేవలం నెల రోజుల్లోనే 40 శాతానికిపైగా నష్టపోవడం గమనార్హం.
KOSPI Crash | ఎందుకీ పతనం?
చైనా నుంచి వస్తున్న చౌక ఏఐ మోడళ్లు అమెరికా స్టాక్ మార్కెట్లలోని భారీ పెట్టుబడులను దెబ్బతీసే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏఐ రంగంలో నేరుగా మూలధనం వెచ్చిస్తున్న కంపెనీలకు బదులు.. వాటివల్ల పరోక్షంగా లాభపడే కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడమే ఉత్తమమని భావిస్తున్నారు. దీంతో ఆయా రంగాల షేర్లపై ప్రభావం పడింది.దక్షిణ కొరియా చిప్ తయారీ సంస్థ ఎస్కే హైనిక్స్ ఇంక్ ఇటీవల రెండో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఆదాయం భారీగా పెరిగినప్పటికీ మార్కెట్ అంచనాలను అందుకోవడంలో విఫలమవడంతో ఆ కంపెనీ సెల్లాఫ్ కు గురవుతోంది. ఈ కంపెనీ షేరు ధర రెండు రోజుల్లో 21 శాతం పడిపోయింది. మరో దిగ్గజ సంస్థ శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ షేర్లు కూడా 23 శాతానికిపైగా నష్టాన్ని చవిచూశాయి.
ఇది కూడా చదవండి..: Stock Market Rally | బుల్ పరుగులు.. భారీ లాభాలతో ముగిసిన సూచీలు