అక్షరటుడే, వెబెడెస్క్ : Rayadurgam Land Price | హైదరాబాద్ (Hyderabad) నగరంలో భూములు రికార్డు ధరలు పలుకుతున్నాయి. గతంలో కోకాపేటలోని నియోపాలిస్ లే అవుట్లో భారీగా ధరలు పలుకగా.. తాజాగా ఆ రికార్డులను రాయదుర్గం అధిగమించింది.
రాయదుర్గంలోని టీజీఐఐసీ (TGIIC) భూములకు తాజాగా అధికారులు వేలం నిర్వహించారు. పాన్ మక్తా ప్రాంతంలో ఉన్న సర్వే నంబర్ 83/1లోని 5.25 ఎకరాలకు ఆన్లైన్లో వేలం వేశారు. ఈ భూమిని ఎకరాకు రూ.264 కోట్లకు ఓ సంస్థ కొనుగోలు చేసింది. గతంలో ఇదే సర్వే నంబరు (83/1) ప్రాంతంలో ఎకరం ధర రూ.237 కోట్లు పలుకగా.. తాజాగా రూ.264 కోట్లు పలకడం విశేషం.
Rayadurgam Land Price | నియోపాలిస్ను దాటి..
హైదరాబాద్ నగరంలో గతంలో కోకాపేట (Kokapet) భూములు రికార్డు ధర పలికేవి. నియోపాలిస్ లే అవుట్లోని భూములకు ప్రభుత్వం వేల వేయగా.. రూ.100 కోట్ల నుంచి రూ.190 కోట్ల వరకు ధర పలికాయి. తాజాగా రాయదుర్గం భూములు ఆ రికార్డును అధిగమించాయి. భూములకు భారీగా ధరలు రావడంతో రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ పుంజుకుంటుందని వ్యాపారులు ఆశిస్తున్నారు.
దీనిని కూడా చదవండి : Maharashtra Cooking Oil Ban | లూజ్ ఆయిల్ విక్రయాలు బంద్.. సర్కార్ కీలక నిర్ణయం