Revanth Reddy BRS Criticism | ఆ బీఆర్ఎస్ లీడర్ అఘోర పూజలు చేయిస్తున్నారు: రేవంత్ రెడ్డి

సంగారెడ్డిలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు

Shivam nagarani

Revanth Reddy BRS Criticism | సంగారెడ్డిలో(Sangareddy) నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. తమ ప్రభుత్వంపై మీడియా, సోషల్ మీడియా వేదికగా కుట్రలు పన్నారని, అవి ఫలించకపోవడంతో ఇప్పుడు పొరుగు రాష్ట్రాలకు వెళ్లి అఘోర పూజలు, చేతబడులు చేయిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రం అల్లకల్లోలం కావాలని, కరువు రావాలని కోరుకోవడం సరికాదన్నారు.

Revanth Reddy BRS Criticism | పొరుగు రాష్ట్రాల్లో అఘోర పూజలు ..

హరీశ్ రావు పేరు ప్రస్తావించకుండా పదేళ్లు మంత్రిగా పనిచేసిన వ్యక్తి.. రాష్ట్ర ప్రజలు నాశనం కావాలని, ప్రభుత్వం కూలిపోవాలని పొరుగు రాష్ట్రాల్లో పూజలు చేయిస్తున్నారని మండిపడ్డారు. తనపై, తమ నాయకులపై చేతబడులు చేస్తే ఎదుర్కొంటామని, కానీ ప్రజల మీద ఇలాంటివి చేయించడం శవ రాజకీయాలు చేయడమేనని ధ్వజమెత్తారు. అడుగు బయటపెడితే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే నాయకులు.. పొరుగు రాష్ట్రాల దేవాలయాలకు వెళ్లినప్పుడు ఎందుకు పోస్టులు పెట్టలేదని ప్రశ్నించారు. శివమొగ్గ గుడికి వెళ్లిన విషయాన్ని దాచిపెట్టి పిల్లిమొగ్గలు వేస్తున్నారని ఎద్దేవా చేశారు.

Revanth Reddy BRS Criticism | త్వరలోనే ఉద్యోగ ఖాళీల భర్తీ..

గతంలో ఐదేళ్లపాటు మహిళలకు మంత్రి పదవి ఇవ్వని వారు ఇప్పుడు మహిళల గురించి మాట్లాడుతున్నారని విమర్శించారు. కేసీఆర్ కుటుంబంలో అందరికీ ఉద్యోగాలొచ్చాయని, కానీ నిరుద్యోగులకు మాత్రం రాలేదన్నారు. తాము ఇచ్చిన మాటకు కట్టుబడి ఉంటామని, త్వరలోనే అన్ని ఉద్యోగ ఖాళీలను చిత్తశుద్ధితో భర్తీ చేస్తామని స్పష్టం చేశారు. సంక్షోభం నుంచి రాష్ట్రాన్ని బయటపడేసి సంక్షేమం వైపు నడిపిస్తున్నామని సీఎం తెలిపారు. ఒకపూట ఆలస్యమైనా సంక్షేమ ఫలాలు ఆగవని, ప్రజల హక్కులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపబోమని హామీ ఇచ్చారు. దుర్మార్గుల మాయమాటలను యువత నమ్మవద్దని సూచించారు.

ఇది కూడా చదవండి: Kamareddy Theft Arrest | Accused arrested for turning to theft due to financial difficulties.

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *