అక్షరటుడే, వెబ్డెస్క్ : Telangana Heavy Rains | రాష్ట్రంలో ఈ నెల 26 నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 23 నుంచి 25 వరకు వర్షాలు కురిసే అవకాశం తక్కువగా ఉందని పేర్కొన్నారు.
తెలంగాణ (Telangana) వ్యాప్తంగా ఇటీవల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. ఆరు రోజుల పాటు విస్తారంగా వానలు పడటంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా రైతులు పంటల సాగు పనులు మొదలు పెట్టారు. అయితే ఈ నెల 23 నుంచి 25 వరకు వర్షాలు తగ్గుముఖం పడుతాయని అధికారులు తెలిపారు. జులై 26 నుండి ఉత్తర, తూర్పు, పశ్చిమ, మధ్య తెలంగాణ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉత్తర తెలంగాణలో అక్కడక్కడా భారీ వర్షాలు పడుతాయి.
Telangana Heavy Rains | నేడు అక్కడక్కడ వర్షాలు
రాష్ట్రంలో శుక్రవారం వాతావరణం పొడిగా ఉంటుంది. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతమై ఉంటుంది. పలు జిల్లాల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడక్కడ వర్షం పడే ఛాన్స్ ఉంది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Telangana Heavy Rains | జలాశయాలు వెలవెల
రాష్ట్రంలోని పెద్ద ప్రాజెక్టులతో పాటు చిన్న డ్యామ్లు, చెరువులు వెలవెలబోతున్నాయి. జులై ముగుస్తున్నా.. జలాశయాల్లోకి వరద రావడం లేదు. దీంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయకట్టుకు నీటి విడుదల లేకపోవడంతో పంటల సాగు చేయడం లేదు. మరోవైపు బోరుబావుల ఆధారంగా పలువురు రైతులు పంటలు వేశారు. అయితే భూగర్భ జలాలు అడుగంటి బోర్లు ఎత్తిపోతున్నాయి. ఇటీవల కురిసిన వర్షాలు అన్నదాతలకు ఊపిరి పోశాయి. చాలా మంది వరినాట్లు వేయడం ప్రారంభించారు. అయితే రానున్న నెలల్లో కూడా ఎల్నినో ప్రభావం ఉంటుందని, వరికి బదులు ఇతర పంటలు వేయాలని అధికారులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి..: Kishan Reddy | విద్యార్థులను అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు: కిషన్ రెడ్డి