అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ponguleti Comments | మాజీ మంత్రి హరీశ్‌రావుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్లో హరీశ్‌రావు ఫ్యూచర్ ఏమిటో ఆయనకే తెలియదని పేర్కొన్నారు.
హరీశ్‌రావు (Harish Rao) శుక్రవారం అమెరికాలో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. అక్కడ ఫార్మాసిటీని కొనసాగిస్తామన్నారు. హరీశ్‌రావు వ్యాఖ్యలకు పొంగులేటి స్పందించారు. అమెరికాలో ఉండి ఫ్యూచర్ సిటీని ఆపేస్తాం అంటూ ప్రకటించిన హరీష్ రావు.. ఈ భూములను తాకట్టు పెట్టడానికి అమెరికాలో ఎవరితోనైనా ఒప్పందం చేసుకున్నారా అని ప్రశ్నించారు.
Ponguleti Comments | అసూయతో..
బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో హైదరాబాద్ (Hyderabad)లో కనీసం ఒక్క మెట్రో స్టేషన్ కూడా కట్టని మీకు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా ఒక నగరమే నిర్మిస్తున్నది అంటే అసూయ కలగక తప్పదని పొంగులేటి విమర్శించారు. కేసీఆర్ కుటుంబ సభ్యుల కోసం ఎక్కడ పడితే అక్కడ ఫాంహౌస్ లు కట్టుకున్నారని ఆరోపించారు. తాము రాష్ట్రం కోసం ఫ్యూచర్ సిటీ కడుతుంటే ఆపుతాం అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Ponguleti Comments | నీ ఫ్యూచర్ కాపాడుకో..
మూసీ ప్రక్షాళన చేస్తామంటే అడ్డు పడుతున్నారని పొంగులేటి ఆగ్రహం వ్యక్తం చేశారు. లగచర్లలో ఇండస్ట్రీస్ పెట్టి యువతకు ఉద్యోగాలిస్తామంటే కుట్రచేశారని, ఇప్పుడు ఫ్యూచర్ సిటీని ఆపుతాం అంటున్నారని పేర్కొన్నారు. అధికారంలోకి వస్తామంటూ హరీశ్‌రావు పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రజల ఆశీస్సులతో వచ్చే ఎన్నికల్లోనూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేశం గర్వించే విధంగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తామని స్పష్టం చేశారు. హరీశ్‌రావు రాజకీయ జీవితం ఖతం చేయాలని కేసీఆర్, కేటీఆర్ చూస్తున్నారని పొంగులేటి అన్నారు. ‘ఫ్యూచర్ లేని బీఆర్ఎస్ పార్టీ నుండి పోయి నీ ఫ్యూచర్ కాపాడుకో’ అని సూచించారు.
ఇది కూడా చదవండి..: CM Yadagirigutta Visit | యాదగిరిగుట్టలో సీఎం పర్యటన.. వేద పాఠశాలకు శంకుస్థాపన


