Telangana Rakshana Sena | మరో 18 నియోజకవర్గాలకు ‘టీఆర్‌ఎస్‌’ ఇన్‌ఛార్జిలను ప్రకటించిన కవిత

తెలంగాణ రక్షణ సేనలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్:  Telangana Rakshana Sena | తెలంగాణ రక్షణ సేనలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత  (  Kalvakuntla Kavitha )రాష్ట్రంలోని మరో 18 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జులను ప్రకటించారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని సోమవారం నూతన నియామకాల జాబితాను విడుదల చేశారు. దీనితో పాటు మెదక్ లోక్‌సభ స్థానంతో పాటు వివిధ రాష్ట్ర అనుబంధ విభాగాలకు అధ్యక్షులను నియమిస్తూ పార్టీ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది.

Telangana Rakshana Sena | 60 స్థానాలకు బాధ్యుల ఖరారు..

కొత్తగా ప్రకటించిన జాబితా ప్రకారం.. ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, కంటోన్మెంట్, కుత్బుల్లాపూర్, ఇబ్రహీంపట్నం, నిజామాబాద్ అర్బన్, నిజామాబాద్ రూరల్, నిర్మల్, ఖానాపూర్, అంబర్‌పేట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, హుజూరాబాద్, పటాన్‌చెరు, దేవరకొండ, నాంపల్లి, ఇల్లందు, అశ్వారావుపేట నియోజకవర్గాలకు పార్టీ బాధ్యులను ఖరారు చేశారు. ఇప్పటికే వివిధ స్థానాలకు సంబంధించి 42 నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జులను ప్రకటించిన కవిత.. తాజా నియామకాలతో కలిపి మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు బాధ్యుల ప్రక్రియను పూర్తి చేశారు.

Telangana Rakshana Sena | అనుబంధ విభాగాల ప్రకటన..

ఇక జిల్లాల వారీగా చూస్తే.. తొమ్మిది జిల్లాలకు పార్టీ అధ్యక్షులను, మూడు జిల్లాలకు ప్రధాన కార్యదర్శులను నియమించారు. అలాగే ఎంబీసీ, న్యాయ, ఎన్ఆర్ఐ, ట్రేడ్ అండ్ కామర్స్, విద్యార్థి, సోషల్ మీడియా, ముస్లిం మైనార్టీ, రైతు, బంజారా, జర్నలిస్ట్, ట్రేడ్ యూనియన్ వంటి ముఖ్యమైన అనుబంధ విభాగాలకు కూడా అధ్యక్షులను ప్రకటించారు. ఎప్పటిలాగే అసెంబ్లీ ఇన్‌ఛార్జులు, జిల్లా అధ్యక్ష పదవుల కేటాయింపులో బీసీ వర్గాలకు అత్యధిక ప్రాధాన్యత కల్పించినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.

ఇది కూడా చదవండి:  SS Retail IPO | ఐపీవోకు ఎస్ఎస్ రిటైల్.. ఆకర్షణీయంగా జీఎంపీ

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *