అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Ganesh Immersion Tragedy | వినాయక నిమజ్జనంలో అపశృతి చోటు చేసుకుంది. చెరువులో మునిగి ఆరుగురు విద్యార్థులు మృతి చెందారు. సంగారెడ్డి (Sangareddy) జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
పటాన్చెరు మండలం ఇంద్రేశం మున్సిపాలిటీ పరిధిలోని పెద్దకంజర్ల గ్రామ శివారులోని శిరీష అనాథాశ్రమం విద్యార్థులు బుధవారం గణేశ్ నిమజ్జనం నిర్వహించారు. నెరెడు చెరువులో గణేష్ విగ్రహ నిమజ్జనం చేస్తుండగా ఆరుగురు విద్యార్థులు నీట మునిగి మరణించారు. విద్యార్థులు చెరువులో లోతుగా వెళ్లారని, వారికి ఈత రాకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు తెలిపారు.
Ganesh Immersion Tragedy | విషాదఛాయలు
నీటి లోతు ఎంత ఉందో ఆ విద్యార్థులకు అంచనా లేదని స్థానికులు పేర్కొన్నారు. దీంతో ఒక్కసారిగా ఆరుగురు నీట మునిగారు. స్థానికులు స్పందించి కాపాడే యత్నం చేసినా.. ఫలితం లేకుండా పోయింది. ఆరుగురు విద్యార్థులు చనిపోవడంతో ప్రాంతం విషాదంలో మునిగిపోయింది. విద్యార్థుల కుటుంబాలు తీవ్ర శోకంలో ఉన్నాయి. పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతులను నర్సింహ రాజు, సుమంత్ (డిప్లొమా సెకండ్ ఇయర్), గణేష్ (డిప్లొమా సెకండ్ ఇయర్), ఉదయ్ కిరణ్ (డిప్లొమా థర్డ్ ఇయర్), శ్యామ్ కుమార్ (డిప్లొమా ఫస్ట్ ఇయర్). సిద్దార్థ్ (టెన్ల్ క్లాస్)గా గుర్తించారు.
దీనిని కూడా చదవండి : Hyderabad Food Safety | పాడైన చికెన్, మటన్‌తో వంటలు.. 9 హోటళ్ల లైసెన్స్‌లు రద్దు