అక్షరటుడే వెబ్‌డెస్క్: Nagpur Crime Case | ఆస్తి ఒప్పందం పేరుతో పిలిచి మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేయడమే కాకుండా, అశ్లీల వీడియోలతో బ్లాక్‌మెయిల్ చేస్తూ బలవంతంగా మత మార్పిడికి పాల్పడిన దారుణ ఘటన నాగ్‌పూర్‌లో వెలుగుచూసింది. బాధితురాలు భారత వైమానిక దళ (IAF) అధికారి భార్య కావడం తీవ్ర కలకలం రేపుతోంది. బాధితురాలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తుండగా, ఆమె మాజీ సహవిద్యార్థి అయ్యాజ్ తాజ్ మదారే ప్లాట్ కొనుగోలు నెపంతో ఫిబ్రవరి 2025లో ఒక హోటల్‌కు రప్పించాడు.
Nagpur Crime Case | అఘాయిత్యం..
హోటల్‌లో ఆమెకు మత్తుమందు కలిపిన జ్యూస్ ఇచ్చి, అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు అత్యాచారం చేసి, ఆ ఘాతుకానికి సంబంధించిన వీడియోలను రికార్డ్ చేశాడు. ఆ అశ్లీల వీడియోలను ఆయుధంగా వాడుకుంటూ, బాధితురాలిని నిరంతరం వేధిస్తూ, రూ. 3.09 లక్షలు బలవంతంగా వసూలు చేశాడు.
Nagpur Crime Case | మతమార్పిడి ఒత్తిడి..
మే నెలాఖరులో నిందితుడు ఆమెను కల్మేశ్వర్‌కు తీసుకెళ్లి, తన సహచరులు అమీన్ షేక్, హజ్రత్ మౌలానాలతో పరిచయం చేయించాడు. అక్కడ బలవంతంగా మతపరమైన ఆచారాలు నిర్వహించి, ఆమె మతం మారిందని , మదారేతో ఆమెకు పెళ్లి అయిందని నమ్మబలికారు. ఈ సమయంలో జరిగిన దారుణాన్ని వీడియో తీశారు. వైరల్ అయిన ఈ వీడియోనే ఈ కేసులో కీలక ఆధారంగా మారింది.
Nagpur Crime Case | పోలీసుల స్పందన..
దాదాపు ఏడాదిన్నర కాలం భయంతో మౌనంగా ఉన్న బాధితురాలు, ఇటీవల తన భర్తకు అసలు విషయం చెప్పి ధైర్యంగా ముందుకు వచ్చింది. ఈ సంఘటనకు సంబంధించి బాధిత మహిళ సోనేగావ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, ప్రధాన నిందితుడు అయ్యాజ్ తాజ్ మదారే , అమీన్ షేక్‌లను అరెస్టు చేశారు. మూడవ నిందితుడు హజ్రత్ మౌలానా కోసం గాలింపు చేపట్టారు. నిందితులపై అత్యాచారం, బెదిరింపులు, అక్రమ మతమార్పిడి , మూఢనమ్మకాల నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేశారు. కోర్టు నిందితులకు ఐదు రోజుల పోలీసు కస్టడీ విధించింది.
In Nagpur, a married woman accused redical Islamists Ayaz Madar and Amir Sheikh of calling her to a hotel,
giving her an intoxicating substance, blackmailing her, demanding ₹300,000, and pressuring her to convert her religion.
Following her complaint, the police arrested… pic.twitter.com/QA3DogDrli
— सकल हिंदू समाज मुंबई 🚩 (@Sakalhindu_) June 15, 2026
ఇది కూడా చదవండి: Sanitation Monitoring | శానిటేషన్‌పై అధికారుల పర్యవేక్షణ తప్పనిసరి: ఎమ్మెల్యే ధన్పాల్