Sanitation Monitoring | శానిటేషన్​పై అధికారుల పర్యవేక్షణ తప్పనిసరి: ఎమ్మెల్యే ధన్​పాల్​

నగరవాసులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా.. నిరంతరం శానిటేషన్ పనులు కొనసాగించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయణ ఆదేశించారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: Sanitation Monitoring | నగరవాసులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా.. నిరంతరం శానిటేషన్ పనులు కొనసాగించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ (MLA Dhanpal) సూర్యనారాయణ స్పష్టం చేశారు. నగరంలోని 34వ డివిజన్​లో మిర్చి కాంపౌండ్, మార్వాడి గల్లీ, ఓల్డ్ రమేష్ టాకీస్ రోడ్డు తదితర కాలనీల్లో పర్యటించారు.

Sanitation Monitoring | అవసరమున్న చోట కల్వర్టుల నిర్మాణం

ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కేవలం స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నప్పుడు మాత్రమే కాకుండా.. నిరంతరం డ్రెయినేజీ పరిశుభ్రత, మంచినీటి సరఫరా, వీధి దీపాల పనులను పర్యవేక్షించాలని తెలిపారు. అవసరమున్న చోట కల్వర్టుల నిర్మాణం చేపట్టాలని సూచించారు. పలు గల్లీల్లో మంచినీటి పైప్​లైన్​ లీకేజీలు గమనించి, వాటిని అరికట్టాలని ఆదేశించారు. ప్రజల నుంచి ఎటువంటి ఫిర్యాదులు అందినా.. సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలన్నారు. నిత్యం పర్యవేక్షణ చేస్తూ నగరాన్ని పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.

Sanitation Monitoring | గంజ్ కమాన్ వద్ద కల్వర్టు..

Sanitation Monitoring

గాంధీ గంజ్ కమాన్ వద్ద కల్వర్టు పూర్తయిన నేపథ్యంలో.. తదుపరి చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. సంబంధిత కాంట్రాక్టర్ కల్వర్టు మాత్రమే నిర్మించి వెళ్లిపోయారని అసహనం వ్యక్తం చేశారు. కల్వర్టు ఎత్తుగా నిర్మించినందునా..రోడ్డుకు సమాంతరంగా చేసి వెళ్లే బాధ్యత వారిది కాదా అని ప్రశ్నించారు. వీలైనంత తొందరగా వాహన రాకపోకలకు సౌకర్యంగా ఉండేలా చూడాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మేయర్ ఉమారాణి రమేష్, కార్పొరేటర్ బంటు ప్రీతి ప్రవీణ్, బీజేపీ నాయకులు పవన్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: ITI Walking Association | ఐటీఐ వాకింగ్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *