MP Arvind Comments | పిప్రి మరో బెంగాల్​ అవుతుంది.. ఎంపీ అర్వింద్​ సంచలన వ్యాఖ్యలు

హిందువులంతా ఏకం కాకపోతే పిప్రి మరో బెంగాల్ అవుతుందని ఎంపీ అర్వింద్ అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, ఆర్మూర్: MP Arvind Comments | హిందువులంతా ఏకం కాకపోతే పిప్రి మరో బెంగాల్ అవుతుందని ఎంపీ అర్వింద్ (MP Arvind) అన్నారు. అప్పు ఇచ్చి అడిగినందుకు పిప్రిలో ఓ వ్యక్తి ఇంటికి నిప్పు పెట్టగా.. విషయం తెలుసుకున్న ఎంపీ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

MP Arvind Comments | బాధిత కుటుంబానికి పరామర్శ..

MP Arvind Comments

ఈ సందర్భంగా బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ తన వంతుగా రూ.లక్ష ఆర్థికసాయం చేశారు. అనంతరం మాట్లాడుతూ..​ పదివేల హిందూ కుటుంబాలు ఉన్న పిప్రిలో ఐక్యంగా లేకపోతే ఎట్లా అని వ్యాఖ్యానించారు. ఓ వర్గం వ్యక్తి ఏకంగా ఇంట్లోకి దూరి అందరిపై పెట్రోల్​ చల్లి నిప్పు పెట్టడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గ్రామ అభివృద్ధి కమిటీ సభ్యులు రూ.25 లక్షల నష్టం జరిగితే రూ.13 లక్షలు ఎలా ఇప్పిస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులంతా ఐక్యంగా లేకపోతే పిప్రి మరో బెంగాల్​ అవుతుందని ఆయన హెచ్చరించారు. ఆయన వెంట పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Sanitation Monitoring | శానిటేషన్​పై అధికారుల పర్యవేక్షణ తప్పనిసరి: ఎమ్మెల్యే ధన్​పాల్​

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *