అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Armoor Prohibitory Orders | ఆర్మూర్ పట్టణంలో నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) పేర్కొన్నారు. ఈ సందర్భంగా సోమవారం ప్రకటన విడుదల చేశారు.
Armoor Prohibitory Orders | అమలులో 163 బీఎన్ఎస్..
పట్టణంలో ఆయా సంఘాల ఆధ్వర్యంలో భరత్ చంద్ర స్కూల్లో జరిగిన ఘటనకు సంబంధించి బంద్ పాటిస్తున్నాయని తమకు సమాచారం ఉందన్నారు. అయితే పట్టణంలో 163 బీఎన్ఎస్ అమలులో ఉన్నందున 29, 30వ తేదీల్లో ఎలాంటి ధర్నాలు, రాస్తారోకోలు, ర్యాలీలు నిర్వహించవద్దని సూచించారు. ప్రజాశాంతికి ఎక్కడా ఎలాంటి భంగం కలగకుండా ముందస్తుగా జాగ్రత్తలు తీసుకున్నామని.. పట్టణ నలుమూలలా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ ఉత్తర్వుల ప్రకారం ఆర్మూర్ పట్టణంలో ఐదుగురికి మించి గుమిగూడడం, గుంపులుగా చేరడం నిషేధమని చెప్పారు. ఆర్మూర్లో ప్రశాంత వాతావరణం నెలకొల్పేందుకు 30వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు 163 బీఎన్ఎస్ అమలులో ఉంటుందని స్పష్టం చేశారు. అనుమానాస్పద వ్యక్తులపై నిఘా ఉంచామని పేర్కొన్నారు. ఈ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఇది కూడా చదవండి..: Nizamabad Rural Police | వ్యభిచార గృహంపై పోలీసుల మెరుపుదాడి