Nizamabad ACP Appointments | నిజామాబాద్​ కమిషనరేట్​ పరిధిలో ఏసీపీల నియామకం..

నిజామాబాద్​ పోలీస్​ కమిషనరేట్ పరిధిలో ముగ్గురు ఏసీపీలు నియమితులయ్యారు. ఈ మేరకు డీజీపీ సీవీ ఆనంద్​ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Nizamabad ACP Appointments | నిజామాబాద్​ పోలీస్​ కమిషనరేట్ (Nizamabad Police Commissionerate)​ పరిధిలో ముగ్గురు ఏసీపీలు నియమితులయ్యారు. ఈ మేరకు డీజీపీ సీవీ ఆనంద్​ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

Nizamabad ACP Appointments | కమిషనరేట్​ పరిధిలో..

సీసీఎస్​ ఏసీపీగా శ్రీశైలం నియమితులయ్యారు. ఈయన గతంలో జిల్లాలో సీఐగా, వివిధ హోదాల్లో విధులు నిర్వహించారు. అలాగే నిజామాబాద్​ టాస్క్​ఫోర్స్​ ఏసీపీగా ఆర్​ నరేందర్​కు పోస్టింగ్​ ఇచ్చారు. నిజామాబాద్​ సీసీఆర్​బీ ఏసీపీగా గురునాయడిని నియమిస్తూ డీజీపీ ఆదేశాలిచ్చారు. ఈ నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 36మంది అధికారులను బదిలీ చేస్తూ డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. ఇందులో కొందరు అధికారులు కొన్నాళ్లుగా పోస్టింగ్​ కోసం వెయిటింగ్​లో​ ఉన్నట్లు సమాచారం.

Police Prajavani |

ఇది కూడా చదవండి..: Armoor Prohibitory Orders | ఆర్మూర్​లో ధర్నాలు.. రాస్తారాకోలు నిషేధం: సీపీ సాయిచైతన్య

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *