అక్షరటుడే, నందిపేట్/ డొంకేశ్వర్: Ganesh Mandap DJ Ban | నందిపేట్, డొంకేశ్వర్ మండలాల గణేష్ మండప నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో ఆర్మూర్ ఏసీపీ జె. వెంకటేశ్వర రెడ్డి సమన్వయ సమావేశం నిర్వహించారు. వినాయక చవితి ఉత్సవాలు, నిమజ్జన వేడుకల సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, పాటించాల్సిన నిబంధనలపై ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు.
Ganesh Mandap DJ Ban | మండపాల వద్ద అందుబాటులో ఉండాలి
ఉత్సవాల్లో డీజే (DJ) సౌండ్ సిస్టమ్ల వినియోగానికి ఎట్టి పరిస్థితిలోనూ అనుమతి లేదని ఏసీపీ స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి డీజేలు వాడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండపాల వద్ద రాత్రి సమయంలో తప్పనిసరిగా నిర్వాహకులు అందుబాటులో ఉండాలని సూచించారు.
Bigala Ganesh Gupta 22A | నేనూ 22A బాధితుడినే!.. మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా సంచలన వ్యాఖ్యలు
ప్రమాదాల నివారణకు ప్రతి మండపం వద్ద ఇసుక బకెట్లు, నీటితో నింపిన డ్రమ్ములను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఈ సమావేశంలో ఆర్మూర్ రూరల్ సీఐ జాన్ రెడ్డి, ఆయా మండలాల ఎంపీడీవోలు, విద్యుత్ శాఖ ఏడీ, ఏఈ, రెవెన్యూ ఆర్ఐలు, గ్రామ పరిధిలోని సర్పంచులు, ఉపసర్పంచులు, గణేష్ మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.