Anant Nag Dadasaheb Phalke | కన్నడ లెజెండ్ అనంత్ నాగ్‌కు ‘దాదాసాహెబ్ ఫాల్కే’ పురస్కారం.. ప్రధాని మోడీ శుభాకాంక్షలు!

అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దక్కడంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేస్తూ ఎక్స్ (X) ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Anant Nag Dadasaheb Phalke | భారతీయ చలనచిత్ర రంగానికి విశిష్ట సేవలుందించిన కన్నడ సీనియర్ నటుడు అనంత్ నాగ్​కు అత్యున్నత గౌరవం లభించింది. 2024 సంవత్సరానికి గానూ ఆయనను ప్రతిష్ఠాత్మక ‘దాదాసాహెబ్ ఫాల్కే‘ అవార్డుకు ఎంపిక చేసినట్లు కేంద్ర ప్రభుత్వం బుధవారం అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబరు 22న గుజరాత్‌లోని కేవడియాలో జరగనున్న 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల కార్యక్రమంలో ఆయనకు ఈ అవార్డును అందజేయనున్నారు.

Anant Nag Dadasaheb Phalke | విలక్షణ నటుడిగా ఐదు దశాబ్దాల ప్రస్థానం

అనంత్ నాగ్ తన నటనా జీవితంలో విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించారు. హీరోగా, సహాయ నటుడిగానే కాకుండా ప్రతినాయకుడిగానూ అనేక పాత్రలకు ప్రాణం పోశారు. కన్నడ, హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, మరాఠీ మరియు ఇంగ్లీష్ భాషల్లో దాదాపు 300కి పైగా సినిమాల్లో నటించారు.

శ్యామ్ బెనెగల్ దర్శకత్వంలో వచ్చిన ‘అంకుర్’ చిత్రం ద్వారా గుర్తింపు పొందిన అనంత్​ నాగ్​.. ప్రసిద్ధ టీవీ సిరీస్ ‘మాల్గుడి డేస్’ ద్వారా దేశవ్యాప్తంగా ఇంటింటికీ సుపరిచితులయ్యారు.

Anant Nag Dadasaheb Phalke | కేజీఎఫ్ (KGF)తో నేటితరానికి సుపరిచితం

పాన్ ఇండియా హిట్ ‘కేజీఎఫ్’ చిత్రంలో ‘ఆనంద్ ఇంగలగి’ పాత్రలో తన గాంభీర్యమైన గొంతు, నటనతో నేటితరం ప్రేక్షకులను తీవ్రంగా ఆకట్టుకున్నారు.

Samantha Seemantham | సీమంతంలో శ్రీవిద్యా సొబగులు..కళా ఆవరణలో మాతృత్వానికి దైవత్వపు అభిషేకం!

Anant Nag Dadasaheb Phalke | ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసలు

అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు దక్కడంపై భారత ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేస్తూ ఎక్స్ (X) ద్వారా శుభాకాంక్షలు తెలిపారు.

“ఏ పాత్రనైనా అత్యంత సహజంగా పోషించే అనంత్ నాగ్ కి ఈ పురస్కారం లభించడం ఎంతో అభినందనీయం. దశాబ్దాలుగా ఆయన తన అద్భుత నటనతో భారతీయ సినిమాపై, ముఖ్యంగా కన్నడ సినీ ప్రపంచంపై చెరగని ముద్ర వేశారు. ప్రతి పాత్రలోనూ ప్రత్యేకమైన లోతును ప్రదర్శించిన గొప్ప కళాకారుడు ఆయన” అని ప్రధాని కొనియాడారు. కన్నడ పరిశ్రమతో పాటు దక్షిణ భారత సినీ రంగ ప్రముఖులు కూడా అనంత్ నాగ్‌కు అభినందనలు తెలిపారు.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *