జాతీయంOdisha Bank Incident | సోదరి అస్థిపంజరంతో బ్యాంక్​కు వెళ్లిన వ్యక్తి.. ఎందుకో తెలుసా?

Odisha Bank Incident | సోదరి అస్థిపంజరంతో బ్యాంక్​కు వెళ్లిన వ్యక్తి.. ఎందుకో తెలుసా?

ఓ వ్యక్తి తన సోదరి అస్థిపంజరంతో బ్యాంక్​కు వెళ్లాడు. ఆమె ఖాతాలోని డబ్బుల కోసం అధికారులు పత్రాలు అడగడంతో అస్థిపంజరాన్ని తీసుకెళ్లాడు.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Odisha Bank Incident | ఓ వ్యక్తి తన సోదరి అస్థిపంజరంతో బ్యాంక్​కు వెళ్లాడు. ఆమె చనిపోయిందనడానికి అధికారులు రుజువులు అడగటంతో సమాధిని తవ్వి అస్థిపంజరాన్ని తీసుకెళ్లాడు. ఈ ఘటన ఒడిశాలోని కియోంఝర్ జిల్లా (Keonjhar District)లో ఈ నెల 27న చోటు చేసుకుంది.

దియానాలి గ్రామానికి (Dianali Village) చెందిన జితు ముండా సోదరి కాక్రా ముండాకు రెండు నెలల క్రితం చనిపోయింది. ఆమెకు మల్లిపాసిలోని ఒడిశా గ్రామీణ బ్యాంకులో ఖాతా ఉండేది. ఆ అకౌంట్​లో రూ.19,300 డబ్బులు ఉన్నాయి. కాక్రా ముండా భర్త, పిల్లలు సైతం చనిపోయారు. దీంతో ఆమె అకౌంట్​లోని డబ్బుల కోసం జితు ముండా బ్యాంక్​ అధికారులను కలిశాడు. దీంతో ఖాతాదారుడు తప్పనిసరిగా హాజరు కావాలని, లేదా అతను చట్టబద్ధమైన వారసత్వ పత్రాలను సమర్పించాలని బ్యాంకు మేనేజర్ డబ్బులు ఇవ్వడానికి నిరాకరించాడు.

Odisha Bank Incident | పత్రాలు లేకపోవడంతో..

జితు చదువుకోలేదు. అతడి వద్ద డెత్​ సర్టిఫికెట్ (Death Certificate)​, ఇతర వారసత్వ పత్రాలు లేవు. దీంతో తన సోదరి మరణించిందని రుజువు చూపడానికి ఆమెను పాతిపెట్టిన గోతిని తవ్వాడు. మృతదేహాన్ని భుజాలపై మోసుకొని మూడు కిలోమీటర్లు ఎండలో నడుచుకుంటూ వెళ్లాడు. ఈ ఘటనతో బ్యాంక్​ సిబ్బంది, ఖాతాదారులు షాక్​ అయ్యారు. సిబ్బంది తీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక పేదవాడు తన సొంత డబ్బులు తీసుకోవడం ఇంత కష్టమా అని ప్రశ్నించారు.

Odisha Bank Incident | స్పందించిన సబ్​ కలెక్టర్​

సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, జితును సముదాయించారు. ఈ కేసును మానవతా దృక్పథంతో విచారిస్తామని, బ్యాంకు నుంచి స్పందన కోరామని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై సబ్ కలెక్టర్ (Sub-Collector) ఉమా శంకర్ దలై మాట్లాడుతూ, ఆ గిరిజన వ్యక్తికి ప్రక్రియపరమైన అంశాలపై అవగాహన లేదన్నారు. నిరాశతో అతను ఈ పని చేశాడని చెప్పారు. అతడికి అవసరమైన పత్రాలు అందించి బ్యాంకుతో సంప్రదించి, రూ. 20వేలు అందేలా చూస్తామన్నారు.

ఇది కూడా చదవండి..: India Defence | సైనిక బలాన్ని పెంచుతున్న భారత్.. రక్షణ రంగ వ్యయంలో నయా రికార్డ్.

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

2 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....

Modi UAE Visit | ప్రధాని మోడీ విదేశీ పర్యటన.. యూఏఈలో కీలక భేటీ!

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Modi UAE Visit | ఐరోపా దేశాల్లో వచ్చే నెల...

IFS Officers Transfers | ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS) అధికారుల బదిలీ

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: IFS Officers Transfers | ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ (IFS)...