SSC Results | రేపే పదో తరగతి పరీక్ష ఫలితాలు

Balla Sandeep Kumar

అక్షరటుడే, వెబ్​డెస్క్ : SSC Results | తెలంగాణ (Telangana)లో పదో తరగతి ఫలితాల విడుదలపై క్లారిటీ వచ్చింది. లక్షలాది మంది విద్యార్థులు ఫలితాల కోసం ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు ఫలితాలు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ (Education Department) అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో ఎన్నడు లేని విధంగా ఈ సారి నెల రోజుల పాటు పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. మార్చి 14న ప్రారంభమైన ఎగ్జామ్స్​ ఏప్రిల్​ 13న ముగిశాయి. మొత్తం 5.15 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరు అయ్యారు. జవాబు పత్రాల మూల్యాంకనం గతంలోనే ముగిసింది. ఈ క్రమంలో బుధవారం ఫలితాలు విడుదల కోసం పరీక్షల విభాగం అధికారులు ఏర్పాట్లు చేశారు.

SSC Results | విద్యార్థుల్లో ఉత్కంఠ

ఫలితాల విడుదల నేపథ్యంలో విద్యార్థుల్లో ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 23వ తేదీతో జవాబుపత్రాల మూల్యాంకనం ముగిసింది. మార్కుల వివరాలను ఆన్​లైన్​లో ఎంటర్​ చేయడం ఇటీవల పూర్తయింది. దీంతో బుధవారం ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు ఫలితాలు విడుదల చేస్తారు. పదో తరగతి అనంతరం విద్యార్థులు ఇంటర్​, ఐటీఐ, పాలిటెక్నిక్​ వంటి కోర్సులను ఎంచుకుంటారు. ఈ క్రమంలో తమకు ఎన్ని మార్కులు వస్తాయి, ఏ కోర్సు తీసుకోవాలని విద్యార్థులు ఆలోచిస్తున్నారు. మరోవైపు తల్లిదండ్రులు సైతం మంచి ఇంటర్​ కాలేజీలో చేర్పించడానికి సిద్ధం అవుతున్నారు.

ఇది కూడా చదవండి..: MPTC ZPTC Elections | ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు.. మరింత ఆలస్యం

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *