అంతర్జాతీయంIndo-Pacific Tension | యుద్ధం అమెరికాది.. లాభం చైనాది.. ఇండో-పసిఫిక్ రీజియన్‌లో కొత్త టెన్షన్

Indo-Pacific Tension | యుద్ధం అమెరికాది.. లాభం చైనాది.. ఇండో-పసిఫిక్ రీజియన్‌లో కొత్త టెన్షన్

పశ్చిమాసియాలో ఇరాన్‌తో సాగిస్తున్న పోరాటం అమెరికాకు ఊహించని తలపోటుగా మారింది.

అక్షరటుడే, వాషింగ్టన్: Indo-Pacific Tension | పశ్చిమాసియాలో ఇరాన్‌తో సాగిస్తున్న పోరాటం అమెరికాకు ఊహించని తలపోటుగా మారింది. ఒకవైపు యుద్ధ ఖర్చులు తడిసి మోపెడవుతుంటే, మరోవైపు కీలకమైన ఆయుధ నిల్వలు వేగంగా కరిగిపోతున్నాయి. దీనివల్ల ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అమెరికా (America) పట్టు సడలే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Indo-Pacific Tension | కరిగిపోతున్న క్షిపణి నిల్వలు:

ఇటీవల యూఎస్ కాంగ్రెషనల్ కమిటీ విచారణలో ఇండో-పసిఫిక్ కమాండర్ అడ్మిరల్ శామ్యూల్ జె పాపారో కీలక విషయాలు వెల్లడించారు. ఇరాన్‌ (Iran)ను ఎదుర్కోవడానికి అమెరికా తన దగ్గరున్న క్షిపణి నిల్వలను భారీగా వాడుతోంది. భవిష్యత్తులో చైనాతో ఏదైనా ఘర్షణ తలెత్తితే అత్యవసరంగా కావాల్సిన ఈ ఆయుధాలను, ఇప్పుడు పశ్చిమాసియాలో ఖర్చు చేయడం ఆందోళన కలిగిస్తోందని ఆయన పేర్కొన్నారు.

Indo-Pacific Tension | క్షిపణి బలగాలను భారీగా పెంచుకుంటూ:

అమెరికా తన దృష్టిని, సైనిక బలగాలను పశ్చిమాసియా వైపు మళ్లించడాన్ని చైనా తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంది. జపాన్ వంటి ప్రాంతాల్లో ఉండాల్సిన మెరైన్ కోర్ యూనిట్లను, యుద్ధ విమానవాహక నౌకలను (అబ్రహం లింకన్ వంటివి) పశ్చిమాసియాకు తరలించడం వల్ల ఇండో-పసిఫిక్ ప్రాంతంలో అమెరికా రక్షణ కవచం బలహీనపడిందని సెనెటర్ రిచర్డ్ బ్లూమెంథల్ అభిప్రాయపడ్డారు. ఇదే సమయంలో చైనా తన క్షిపణి బలగాలను భారీగా పెంచుకుంటూ తైవాన్ ఆక్రమణకు వ్యూహాలు రచిస్తోంది.

Indo-Pacific Tension | తీవ్ర వ్యతిరేకత:

ఇరాన్‌తో యుద్ధం అమెరికా ఆర్థిక వ్యవస్థపై కూడా భారాన్ని పెంచుతోంది. టెహ్రాన్‌ (Tehran)ను కట్టడి చేసేందుకు అమెరికా రోజుకు సుమారు ఒక బిలియన్ డాలర్ ఖర్చు చేస్తున్నట్లు అంచనా. ఇంత భారీ మొత్తంలో ప్రజాధనాన్ని యుద్ధానికి వెచ్చించడంపై అమెరికా ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది.

మొత్తానికి, ఇరాన్‌తో మొదలైన ఈ పోరులో అమెరికా ఇరుక్కుపోయినట్లు కనిపిస్తోంది. ఒకవైపు సొంత నిల్వలు తగ్గుతూ, మరోవైపు చైనా ముప్పు పెరుగుతుండటంతో అగ్రరాజ్యం ఇప్పుడు ఆత్మరక్షణలో పడింది.

ఇది కూడా చదవండి..: Hong Kong Housing Crisis : వరల్డ్ రిచెస్ట్ సిటీలో గృహ సంక్షోభం.. అట్ట పెట్టెల్లో జీవనం.. భారత్‌లోనూ ఇదే పరిస్థితి వస్తుందా?

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....