అక్షరటుడే వెబ్డెస్క్: Saudi Aramco Helicopter Crash | సౌదీ అరేబియాలో జరిగిన ఒక విషాదకర ఘటనలో 14 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలోని ప్రముఖ పారిశ్రామిక నగరం ‘రాస్ తానూరా’ సమీపంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రపంచ ప్రసిద్ధ చమురు దిగ్గజం ‘సౌదీ అరామ్కో’ సంస్థకు చెందిన హెలికాప్టర్ కూలిపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది.
Saudi Aramco Helicopter Crash | ప్రమాదం ఎలా జరిగిందంటే..
చమురు క్షేత్రాల పర్యవేక్షణ , రవాణా విధుల్లో భాగంగా ఈ హెలికాప్టర్ ప్రయాణిస్తుండగా ప్రమాదానికి గురైంది. సమాచారం అందిన వెంటనే సౌదీ సివిల్ డిఫెన్స్, అరామ్కో రక్షణ విభాగాలు , భద్రతా బలగాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. అయితే, ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండటంతో అందులో ప్రయాణిస్తున్న 14 మంది అక్కడికక్కడే మరణించారు. మరణించిన వారంతా సౌదీ పౌరులేనని అధికారిక వర్గాలు ధ్రువీకరించాయి.
Saudi Aramco Helicopter Crash | దర్యాప్తు ప్రారంభం..
హెలికాప్టర్ ఎందుకు కుప్పకూలిందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు. సాంకేతిక లోపం వల్ల జరిగిందా లేదా వాతావరణ పరిస్థితులు కారణమా అనే కోణంలో అధికారులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సౌదీ ఇంధన మంత్రిత్వ శాఖ తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది.
#BreakingNews | కుప్పకూలిన హెలికాప్టర్.. 14 మంది దుర్మరణం
సౌదీ అరేబియాలోని రాస్ తానూరాలో హెలికాప్టర్ కూలడంతో 14 మంది మృతి చెందారు. ఘటనాస్థలంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. కాగా.. ఈ హెలీకాప్టర్ అరామ్కోకు చెందినది.#SaudiArabia… pic.twitter.com/ehMN0cpegE
— Akshara Today | Telugu News (@aksharatoday) June 28, 2026
ఇది కూడా చదవండి: NEET Protest | ప్రధాని, కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాల్సిందే..