అక్షరటుడే వెబ్‌డెస్క్:Uber Hyderabad Expansion|తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉబర్ (Uber) సీఈవో దారా ఖోస్రోషాహి నేతృత్వంలోని ప్రతినిధి బృందం జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉబర్ వ్యాపార విస్తరణ , నగరాల్లో రవాణా సమస్యల పరిష్కారంపై కీలక చర్చలు జరిగాయి.
Uber Hyderabad Expansion|పార్కింగ్ సమస్యలకు పరిష్కారం చూపండి..
హైదరాబాద్ వంటి ప్రధాన నగరాల్లో పెరుగుతున్న పార్కింగ్ సమస్యపై ఉబర్ సంస్థ ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ముఖ్యంగా మెట్రో స్టేషన్ల వద్ద తగిన పార్కింగ్ సౌకర్యాలు లేకపోవడంతో ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఆయన వివరించారు. కేవలం రవాణా సేవలే కాకుండా, ఈవీ (EV) ఛార్జింగ్ సెంటర్లు , మల్టీ లెవల్ పార్కింగ్ కేంద్రాల ఏర్పాటు దిశగా అడుగులు వేయాలని కోరారు. సీఎం ఇచ్చిన ఈ సూచనలపై సమగ్రంగా అధ్యయనం చేస్తామని ఉబర్ బృందం వెల్లడించింది.
Uber Hyderabad Expansion|హైదరాబాద్‌లో ఉబర్ విస్తరణ..
అమెరికా వెలుపల ఉబర్ ఏర్పాటు చేసిన మొట్టమొదటి ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ హైదరాబాద్‌లోనే ఉందని సీఈవో ఖోస్రోషాహి గుర్తుచేశారు. ప్రస్తుతం ఈ కేంద్రంలో 600 మంది సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు పనిచేస్తున్నారని, దీనిని మరింత విస్తరించనున్నట్లు ఆయన సీఎంకు వివరించారు.
Uber Hyderabad Expansion|ఫ్యూచర్ సిటీపై ఆసక్తి..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 30 వేల ఎకరాల్లో నిర్మిస్తున్న ‘ఫ్యూచర్ సిటీ’ ప్రాజెక్టు గురించి సీఎం ప్రతినిధులకు వివరించారు. ప్రపంచ ప్రఖ్యాత 500 కంపెనీలను ఈ సిటీకి ఆహ్వానిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో, ఫ్యూచర్ సిటీలో ఉబర్ కార్పొరేట్ కార్యాలయాన్ని నిర్మించడానికి తాము ఆసక్తిగా ఉన్నామని ఉబర్ సీఈవో ప్రకటించారు. తమ సంస్థ విస్తరణకు తెలంగాణ ప్రభుత్వ సహకారం కొనసాగాలని ఆయన ముఖ్యమంత్రిని కోరారు.
ఇది కూడా చదవండి: Bandi Bhagirath Case | నాకు రెండు రోజుల సమయం కావాలి.. పోలీసులకు బండి భగీరథ్ లేఖ

