అక్షరటుడే వెబ్‌డెస్క్: Swatantra Bharadwaj Arrest | ఢిల్లీలోని జంతర్‌మంతర్ వేదికగా మరోసారి నిరసనల పరంపర మొదలైంది. సీజేపీ (CJ P) ఆధ్వర్యంలో పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనలు చేపట్టారు. నిశూ ఆజాద్ అనే విద్యార్థిని తండ్రిపై దాడి చేసి తల పగలగొట్టానని ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌లో గర్వంగా అంగీకరించిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ స్వతంత్ర భరద్వాజ్‌ను వెంటనే అరెస్టు చేయాలని సీజేపీ నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్ రంకా తదితరులు డిమాండ్ చేశారు. ఈ నిరసనకు మద్దతుగా ఆజాద్ సమాజ్ పార్టీ అధినేత, ఎంపీ చంద్రశేఖర్ ఆజాద్ కూడా స్వయంగా హాజరయ్యారు. బాధితుడు దళిత కుటుంబానికి చెందినవాడు కావడంతో.. స్వతంత్ర భరద్వాజ్‌పై ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు హత్యాయత్నం కేసు నమోదు చేయడంలో ఢిల్లీ పోలీసులు విఫలమయ్యారని ఆరోపించారు.
Swatantra Bharadwaj Arrest | ఒక్క పాడ్‌కాస్ట్ వీడియోతో దుమారం..
జంతర్‌మంతర్ వద్ద జరిగిన ఆందోళనలపై స్వతంత్ర భరద్వాజ్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూన్ 23న జరిగిన నిరసనలో దళిత విద్యార్థిని తండ్రి సంజయ్ కుమార్ తల పగలగొట్టానని, తన దాడిలో ఆయనకు ఏకంగా 60 కుట్లు పడ్డాయని చెప్పుకున్నాడు. అంబులెన్స్‌లో చావుబతుకుల మధ్య ఉన్నప్పటికీ తనపై హత్యాయత్నం కేసు పెట్టలేదని, రాత్రంతా బయటే స్వేచ్ఛగా తిరిగానని పేర్కొన్నాడు. తన వెనుక బీజేపీకి చెందిన కొందరు బడా నేతల అండదండలు ఉన్నాయని ఆయన చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తీవ్ర దుమారం రేగింది. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందిస్తూ.. బీజేపీ నేతల రక్షణ ఉండబట్టే ఆ నేరస్థుడు అలా మాట్లాడుతున్నాడని, ఇప్పుడైనా చర్యలు తీసుకుంటారా అంటూ ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను నిలదీశారు.
Swatantra Bharadwaj Arrest | మాట మార్చిన ఇన్ఫ్లుయెన్సర్..
ఈ వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో రాజకీయంగా కలకలం సృష్టించడంతో స్వతంత్ర భరద్వాజ్ తన మాట మార్చారు. ఆత్మరక్షణ చర్యలో భాగంగానే తాను ఎదురుదాడి చేయాల్సి వచ్చిందని కొత్త వాదన తెరపైకి తెచ్చారు. తనను 10-15 మంది చుట్టుముట్టారని, ఆ సమయంలో తాను ఆ విధంగా స్పందించకపోతే ఆ గుంపు తనను కొట్టి చంపేసేదని ఆరోపించారు. మొదట తానే స్వయంగా దాడి చేశానని గర్వంగా చెప్పుకున్న వ్యక్తి, ఇప్పుడు తీవ్ర విమర్శలు రావడంతో ఆత్మరక్షణ అస్త్రం ప్రయోగించడం చర్చనీయాంశంగా మారింది. విద్యార్థులపై బయటి వ్యక్తులు దాడి చేశారంటూ సీజేపీ చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఈ ఉదంతం రాజకీయంగా ఎలాంటి మలుపులు తిరుగుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
దాడికి పాల్పడిన స్వతంత్ర భరద్వాజ్‌ను అరెస్ట్ చేయాలి: CJP
విద్యార్థి నిరసనకారుడి తండ్రిపై దాడి ఘటనలో నిందితుడు స్వతంత్ర భరద్వాజ్‌ను అరెస్ట్ చేయాలని CJP ప్రతినిధి బృందం డిమాండ్ చేసింది.
ఈ మేరకు పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పోలీసులను కలిసి చర్యలు… pic.twitter.com/qiZFdMDunA
— ఉదయం (@udayamdigital) September 4, 2026
ఇది కూడా చదవండి: Harish Rao Comments | కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలన వెయ్యి పడగల మయం: హరీష్ రావు