Jantar Mantar Attack | జంతర్ మంతర్ విద్యార్థుల దాడులపై చర్చకు సిద్ధం.. విపక్షాలకు అమిత్ షా సవాల్!

Shivam nagarani

అక్షరటుడే, వెబ్​డెస్క్: Jantar Mantar Attack | పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు వాడీవేడిగా కొనసాగుతున్నాయి. ఢిల్లీ (Delhi)లోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై జరిగిన దాడుల వ్యవహారానికి సంబంధించి, దీని వెనుక ఎవరి ఆదేశాలు ఉన్నారో ప్రభుత్వం ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ ప్రతిపక్షాలు సభను అడ్డుకుంటున్నాయి.

ఈ నేపథ్యంలో లోక్‌సభలో మాట్లాడిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఈ కీలక అంశంపై సమగ్ర చర్చకు ప్రభుత్వం పూర్తి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. విపక్షాలు హంగామా మాని సభలో చర్చకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

Jantar Mantar Attack | పార్లమెంటరీ నిబంధనల ప్రకారం ..

చర్చకు సంబంధించి విపక్షాల ముందు పలు కీలక ప్రతిపాదనలు ఉంచారు. మధ్యాహ్నం 2:00 గంటలలోపు స్పీకర్‌కు లేఖ సమర్పిస్తే 3:00 గంటల నుంచే చర్చను ప్రారంభించవచ్చని, కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా పార్లమెంటరీ నిబంధనల ప్రకారం సమగ్ర చర్చ జరగాలని ఆయన స్పష్టం చేశారు. అవసరమైతే స్పీకర్ అనుమతితో ప్రశ్నోత్తరాల సమయాన్ని రద్దు చేసి, మరుసటి రోజు మధ్యాహ్నం 3:00 గంటల వరకు నిరంతరాయంగా చర్చ జరపవచ్చని పేర్కొన్నారు. చర్చ జరిగేంత వరకు తానే స్వయంగా సభలో ఉండి ప్రతి అంశాన్ని నోట్ చేసుకుని సమాధానం ఇస్తానని తెలిపారు. విపక్షాలు సభలో అర్థవంతమైన చర్చ కోరుకుంటున్నాయా లేక కేవలం గందరగోళం సృష్టించాలనుకుంటున్నాయా అనేది ఇప్పుడు వారే తేల్చుకోవాలని అమిత్ షా సవాల్ విసిరారు.

ఇది కూడా చదవండి: Modi Book Reading | రీల్స్ సంస్కృతికి దూరంగా ఉండాలి.. యువతకు ప్రధాని మోదీ పిలుపు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *