అక్షరటుడే, భీమ్‌గల్: Sarpanch Husband Interference | ప్రజాసమస్యల పరిష్కారంలో సర్పంచ్ భర్త జోక్యం తగదని భీమ్‌గల్ మండలం బడాభీమ్‌గల్ కాంగ్రెస్ మండల (Bada Bheemgal Mandal) జనరల్ సెక్రెటరీ రాగుల మోహన్, గ్రామ శాఖ అధ్యక్షుడు దాకటి స్వామి అన్నారు. ఈ మేరకు బుధవారం విలేకరులతో మాట్లాడారు.
Sarpanch Husband Interference | హామీల అమలులో నిర్లక్ష్యం..
ఎన్నికలై ఆర్నెళ్లు కావస్తున్నా సర్పంచ్ రాచకొండ విష్ణువర్ధిని ప్రధాన వాగ్ధానాలను అమలు చేయడం లేదని వారు ఆరోపించారు. గ్రామానికి ఉచిత అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తామని, యువత కోసం జిమ్ ఏర్పాటు చేస్తామని, ప్రజలకు 24 గంటలు అందుబాటులో ఉంటామని చెప్పి ఓట్లు వేయించుకున్నారని గుర్తుచేశారు. గెలిచాక ఆ హామీలను పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు.
Sarpanch Husband Interference | సర్పంచ్ భర్త పెత్తనం ఆపాలి
గ్రామ పంచాయతీ పాలనలో సర్పంచ్ స్థానంలో ఉన్న మహిళ కంటే, ఆమె భర్త (ఉప సర్పంచ్) శంకర్‌గౌడ్ జోక్యమే ఎక్కువగా ఉందని నాయకులు ఆరోపించారు. సర్పంచ్ భర్త పెత్తనం కాకుండా ప్రజాస్వామ్యబద్ధమైన పాలన సాగేలా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సర్పంచ్ నిత్యం గ్రామ పంచాయతీ కార్యాలయంలో అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలు తీర్చాలన్నారు. ఎన్నికల హామీల అమలులో మరింత జాప్యం జరిగితే గ్రామస్థులతో కలిసి ఆందోళనలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో నాయకులు రాగుల లింబాద్రి, ఆకుల గంగాధర్, జంగం ప్రభు, రాగుల కిషన్, మాజీ ఎంపీటీసీ వల్లి, ముచ్కూర్ నరేష్, పల్లె మైపాల్, సూల భోజన్న, భూమన్న, ఆయటి రవీందర్, రాజ గంగారం, దండు మహేష్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: Ear Infection Symptoms | చెవిలో చీము వస్తుంటే అలర్ట్ కావాల్సిందే..