Indian Stock Market | కుదరని శాంతి.. పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధర.. భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్

Shivam nagarani

అక్షరటుడే, వెబ్​డెస్క్: Indian Stock Market | పశ్చిమాసియాలో భౌగోళిక రాజకీయ ఆందోళనలు ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు. హార్ముజ్ జలసంధి (Strait of Hormuz) పునఃప్రారంభంపై అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన చర్చలు విఫలమవడంతో నౌకల రాకపోకలు, చమురు రవాణా పడిపోవడం వంటి అంశాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ద్రవ్యోల్బణం పెరిగే అవకాశాలుండడంతో ప్రధాన సూచీలైన సెన్సెక్స్, నిఫ్టీ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నాయి.

Indian Stock Market | ఫ్లాట్ గా ప్రారంభమై..

దేశీయ స్టాక్ మార్కెట్ బుధవారం ఉదయం ఫ్లాట్ గా ప్రారంభమైంది. సెన్సెక్స్ 109 పాయింట్ల లాభంతో ప్రారంభమైనా నిýదొక్కుకోలేక ఇంట్రాడే గరిష్టాలనుంచి 690 పాయింట్లు పడిపోయింది. నిఫ్టీ ఫ్లాట్ గా ప్రారంభమై 186 పాయింట్లు కోల్పోయింది. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ 628 పాయింట్ల నష్టంతో 77,525 వద్ద, నిఫ్టీ 200 పాయింట్ల నష్టంతో 24,271 వద్ద ఉన్నాయి.

Indian Stock Market | టాటా గ్రూప్‌లో అమ్మకాల ఒత్తిడి..

టాటా సన్స్ చైర్మన్ స్థానానికి చంద్రశేఖరన్ రాజీనామా చేయడంతో టాటా గ్రూప్ షేర్లు అమ్మకాల ఒత్తిడికి గురవుతున్నాయి. టీసీఎస్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, టైటాన్, టాటా స్టీల్ షేర్లు భారీగా పతనమయ్యాయి.

Gainers : బీఎస్ఈ సెన్సెక్స్‌లో 4 స్టాక్స్ లాభాలతో, 26 స్టాక్స్ నష్టాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఎస్బీఐ 1 శాతం, మారుతి 0.25 శాతం, ఐసీఐసీఐ బ్యాంక్ 0.10 శాతం, బజాజ్ ఫిన్‌సర్వ్ 0.03 శాతం లాభాలతో ఉన్నాయి.

Top Losers : టీసీఎస్ 5.18 శాతం, టాటా స్టీల్ 2.07 శాతం, ఎం అండ్ ఎం 1.78 శాతం, ఇన్ఫోసిస్ 1.71 శాతం, టైటాన్ 1.64 శాతం నష్టాలతో ఉన్నాయి.

ఇది కూడా చదవండి: Tata Sons Chairman | టాటా సన్స్ ఛైర్మన్​ పదవికి చంద్రశేఖరన్ గుడ్​బై.. TCS షేర్లు పతనం..

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *