అక్షరటుడే, వెబ్‌డెస్క్: Behari Lal Engineering IPO | పంజాబ్‌కు చెందిన బేహారీ లాల్ ఇంజినీరింగ్ కంపెనీని 1995లో ఏర్పాటు చేశారు. ఈ కంపెనీ ప్రధానంగా స్టీల్, విద్యుత్, హెవీ ఇంజినీరింగ్ వంటి పరిశ్రమల్లో వినియోగించే మెటల్ రోల్స్, ఇంజినీరింగ్ కాస్టింగ్స్, అల్లాయ్ స్టీల్ ఉత్పత్తులు, ఫోర్జింగ్ ఇంగాట్స్ తయారు చేస్తుంది. దేశీయ మార్కెట్‌తో పాటు విదేశీ మార్కెట్లలోనూ సంస్థ కార్యకలాపాలు కొనసాగిస్తోంది. కంపెనీ తయారు చేసే ప్రెసిషన్ ఇంజినీరింగ్ భాగాలను 21 దేశాలకు ఎగుమతి చేస్తోంది.
Behari Lal Engineering IPO | రూ. 302 కోట్ల ఇష్యూ..
కంపెనీ ఐపీవో (IPO) ద్వారా రూ. 302 కోట్లు సమీకరించనుంది. ఇందులో రూ. 93 కోట్ల విలువైన ఫ్రెష్ ఇష్యూ ఉండగా.. ఆఫర్ ఫర్ సేల్ ద్వారా మిగతా మొత్తాన్ని సమీకరించనుంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా సమీకరించే తాజా నిధుల్లో కొంత మొత్తాన్ని కంపెనీ తన తయారీ యూనిట్ల విస్తరణ, ఆధునికీకరణ కోసం వినియోగించనుంది. కొత్త పరికరాల కొనుగోలు, సివిల్ వర్క్స్ కోసం కొంత మొత్తాన్ని వెచ్చించనుంది.
Behari Lal Engineering IPO | ప్రైస్ బ్యాండ్..
కంపెనీ ధరల శ్రేణిని రూ. 271 నుంచి రూ. 285గా నిర్ణయించింది. ఒక లాట్‌లో 52 షేర్లున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం ఒక లాట్ కోసం గరిష్ట ప్రైస్ బ్యాండ్ వద్ద రూ. 14,820 తో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. గరిష్టంగా 13 లాట్ల కోసం బిడ్లు వేయవచ్చు.
కోటా : క్యూఐబీలకు 50 శాతం, రిటైల్ ఇన్వెస్టర్లకు 35 శాతం, ఎన్ ఐఐలకు 15 శాతం కోటా కేటాయించారు.
జీఎంపీ : గ్రే మార్కెట్‌లో కంపెనీ షేర్లకు డిమాండ్ ఉంది. ఒక్కో షేరుకు రూ. 67 ప్రీమియం లభిస్తోంది. అంటే ఐపీవో అలాట్ అయినవారికి లిస్టింగ్ సమయంలో 23 శాతం లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ముఖ్యమైన ధరలు : ఆగస్టు 12న ప్రారంభమైన ఐపీవో సబ్‌స్క్రిప్షన్.. ఆగస్టు 14న ముగుస్తుంది. షేర్ల అలాట్‌మెంట్ స్టేటస్ 17న రాత్రి వెల్లడవుతుంది. కంపెనీ షేర్లు 19న బీఎస్ ఈ, ఎన్ ఎస్ ఈ లలో లిస్టవుతాయి.
ఇది కూడా చదవండి: Indian Stock Market | కుదరని శాంతి.. పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధర.. భారీ నష్టాల్లో దేశీయ స్టాక్ మార్కెట్