Devarayamjal Fire Accident | దేవరయాంజల్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఐస్‌క్రీమ్ కోల్డ్ స్టోరేజ్ దగ్ధం

Shivam nagarani

అక్షరటుడే, వెబ్​డెస్క్: Devarayamjal Fire Accident | మేడ్చల్ జిల్లా (Medchal District) తూముకుంట మున్సిపాలిటీ పరిధిలోని దేవరయాంజల్‌లో బుధవారం ఉదయం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక ‘డైరీ క్లాసిక్ ఐస్‌క్రీమ్’ కంపెనీకి చెందిన కోల్డ్ స్టోరేజ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ఉదయం వేళ షార్ట్ సర్క్యూట్ కావడంతోనే ఈ ప్రమాదం సంభవించినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. క్షణాల్లోనే మంటలు చుట్టుముట్టడంతో పరిసర ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగ కమ్ముకుంది. ఇది చూసి స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.

Devarayamjal Fire Accident | భారీగా ఆస్తి నష్టం..

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, హైడ్రా (HYDRAA) బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటలు పక్కనున్న భవనాలకు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రమాద సమయంలో లోపల ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు. అయితే కోల్డ్ స్టోరేజ్‌లోని సరుకు, ఫ్రీజింగ్ పరికరాలు పూర్తిగా కాలిపోవడంతో భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

ఇది కూడా చదవండి: HCU Drug Raid | హెచ్‌యూవీలో డ్రగ్స్ కలకలం.. 17 మంది విద్యార్థులకు గంజాయి పాజిటివ్

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *