Ghatkesar CI Suspension | ఘట్‌కేసర్ సీఐపై సస్పెన్షన్​ వేటు

ఘట్​కేసర్​ సీఐ బాలస్వామిని సస్పెండ్​ చేస్తూ మల్కాజ్​గిరి సీపీ సుమతి ఉత్తర్వులు జారీ చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Ghatkesar CI Suspension | మేడ్చల్​–మల్కాజ్​గిరి జిల్లా ఘట్​కేసర్​ సీఐపై ఉన్నతాధికారులు సస్పెన్షన్​ వేటు వేశారు. ఆయనపై అవినీతి ఆరోపణలు రావడంతో చర్యలు తీసుకున్నారు.

ఘట్​కేసర్​ (Ghatkesar) సీఐ బాలస్వామిపై అవినీతి ఆరోపణలు వచ్చాయి. అంతేగాకుండా ఆయన సివిల్ వ్యవహారాల్లో తలదూర్చినట్లు సమాచారం. కొండాపూర్​లో ఓ భూ వివాదం కేసు, మరో యువతి ఆత్మహత్య కేసు దర్యాప్తును తప్పుదారి పట్టించేందుకు డబ్బులు తీసుకున్నట్లు సమాచారం. ఈ మేరకు ఆయనపై ఫిర్యాదులు రావడంతో సీపీ సుమతి విచారణకు ఆదేశించారు.

Ghatkesar CI Suspension | విచారణలో తేలడంతో..

ఉన్నతాధికారుల విచారణలో సీఐపై వచ్చిన ఆరోపణలు నిజమని తేలింది. దీంతో మల్కాజ్​గిరి సీపీ సుమతి సీఐ బాలస్వామని సస్పెండ్​ చేస్తూ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.

ఇది కూడా చదవండి..: Hyderabad Car Accident | హైదరాబాద్​లో కారు బీభత్సం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *