Harish Rao Power Crisis | మీ పాలనే ఎల్‌నినో కంటే పెద్ద విపత్తు.. రేవంత్ ప్రభుత్వంపై హరీశ్ రావు ఆగ్రహం

రాష్ట్రంలో ఏర్పడిన విద్యుత్ సమస్యలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయాలపై మాజీ మంత్రి, బీఆర్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తీవ్రంగా మండిపడ్డారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Harish Rao Power Crisis | రాష్ట్రంలో ఏర్పడిన విద్యుత్ సమస్యలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ( Revanth Reddy ) నిర్ణయాలపై మాజీ మంత్రి, బీఆర్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు తీవ్రంగా మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి అధికారులపై నెపం తోసేయడం కాంగ్రెస్ పాలనకు అలవాటుగా మారిందని విమర్శించారు. త్వరలోనే ప్రజలు, ఉద్యోగులు కలిసి ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.

Harish Rao Power Crisis | నిర్లక్ష్యమే కారణం..

రాష్ట్రంలో తలెత్తిన కరెంట్ కష్టాలకు కాంగ్రెస్ సర్కార్ ముందస్తు ప్రణాళిక లేకపోవడమే కారణమని హరీశ్ రావు ఆరోపించారు. అవసరమైన బొగ్గు నిల్వలు సరి చూసుకోకపోవడం, విద్యుత్ పరిస్థితిపై క్రమబద్ధమైన సమీక్షలు చేపట్టకపోవడమే ప్రస్తుత పరిస్థితికి దారితీసిందన్నారు. గత కొన్ని నెలలుగా ఎల్‌నినో ప్రభావంపై నిపుణులు ముందే హెచ్చరించినా ప్రభుత్వం స్పందించకుండా, ఇప్పుడు చేతులు కాలాక అధికారులపై చర్యలకు సిద్ధపడటం దారుణమని వ్యాఖ్యానించారు.

Harish Rao Power Crisis | బలిపశువులను చేసే యత్నం..

నిషేధిత భూముల వ్యవహారమైనా, విద్యుత్ లోపాలైనా సరే తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు అధికారులను బలిపశువులను చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎల్‌నినోను కొవిడ్‌తో సీఎం పోల్చడాన్ని తప్పుబడుతూ.. అసలైన విపత్తు ఈ ప్రభుత్వ పాలనేనని ధ్వజమెత్తారు. అధికారుల ఉద్యోగాలు ఊడగొడతామని బెదిరిస్తున్న ముఖ్యమంత్రి, మున్ముందు తన పదవికే ప్రమాదం రాకుండా చూసుకోవాలని హరీశ్ రావు స్పష్టం చేశారు.

ఇది కూడా చదవండి:  Tombo Imaging IPO | 71 శాతం జీఎంపీ.. ఊరిస్తున్న డిఫెన్స్ కంపెనీ ఐపీవో

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *