Harish Rao | పాఠ్య పుస్తకాలు ముద్రిస్తున్న ప్రింటర్లకు బిల్లులు చెల్లించాలి : హరీశ్​రావు

తెలంగాణలో పాఠ్య పుస్తకాలు ముద్రిస్తున్న ప్రింటర్లకు బిల్లులు చెల్లించాలని మాజీ మంత్రి హరీశ్​రావు డిమాండ్ చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Harish Rao | తెలంగాణ (Telangana)లో పాఠ్య పుస్తకాలు ముద్రిస్తున్న ప్రింటర్లకు బిల్లులు చెల్లించాలని మాజీ మంత్రి హరీశ్​రావు డిమాండ్ చేశారు. మూసీ సుందరీకరణ, అందాల పోటీలకు ఖర్చు చేసేందుకు నిధులు ఉంటాయి. కానీ పేద విద్యార్థులకు ఉచితంగా అందించే పాఠ్యపుస్తకాలను ముద్రించిన వారికి బిల్లులు చెల్లించేందుకు డబ్బులు లేవా అని ప్రశ్నించారు.

తమకు మూడేళ్లుగా ప్రభుత్వం నుంచి బిల్లులు పెండింగ్​లో ఉన్నాయని వెబ్​ ఆఫ్​సెట్​ ప్రింటర్లు అన్నారు. ఈ మేరకు హరీశ్​రావును కలిసి వినతి పత్రం అందించారు. ప్రభుత్వం బిల్లులు ఇచ్చేలా కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాఉడూత.. ప్రభుత్వ అవసరాల కోసం పుస్తకాలను ముద్రించి సరఫరా చేసిన చిన్న పరిశ్రమలు బకాయిల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఎందుకు వచ్చిందన్నారు. 56 మంది వెబ్ ఆఫ్‌సెట్ ప్రింటర్లకు సుమారు రూ.76 కోట్ల బిల్లులు మూడేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నారు.

Harish Rao | ఆర్థిక సంక్షోభంలో..

నాణ్యతతో, గడువులో పుస్తకాలను ముద్రించి సరఫరా చేసినా తమకు బిల్లులు రాలేదని ప్రింటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. అయినా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని హరీశ్​రావు ప్రశ్నించారు. బిల్లులు రాకపోవడంతో యాజమాన్యాలు కార్మికులకు జీతాలు ఇవ్వడానికి ఇబ్బందులు పడుతున్నాయని, పరిశ్రమల అద్దెలు, విద్యుత్ బిల్లులు కట్టలేక చిన్న పరిశ్రమలు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రింటర్లకు పెండింగ్‌లో ఉన్న రూ.76 కోట్ల బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఆయన డిమాండ్​ చేశారు.

ఇది కూడా చదవండి..: Indiramma Family Life Insurance | ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం ప్రారంభించాలి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *