అక్షరటుడే, వెబ్‌డెస్క్: PDS Rice Seized | మహారాష్ట్ర Maharashtra కు అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉంచిన ప్రభుత్వ ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) బియ్యాన్ని నిజామాబాద్ టౌన్–I పోలీసులు పట్టుకున్నారు. నిజామాబాద్ నగరంలోని మిర్చి కాంపౌండ్‌లో ఉన్న న్యూ పాపులర్ ట్రాన్స్‌పోర్ట్ వద్ద సుమారు 400 బ్యాగుల్లో ఉన్న 100 క్వింటాళ్ల బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
PDS Rice Seized | 400 బ్యాగుల స్వాధీనం..
విశ్వసనీయ సమాచారం మేరకు టౌన్–I పోలీసు సిబ్బంది న్యూ పాపులర్ ట్రాన్స్‌పోర్ట్‌లో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ PDSకు చెందిన బియ్యం అక్రమంగా మహారాష్ట్రకు తరలించేందుకు సిద్ధంగా ఉన్నట్లు గుర్తించారు. దీంతో సుమారు 400 బ్యాగుల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.
PDS Rice Seized | పోలీసుల దర్యాప్తు..
ఈ వ్యవహారానికి సంబంధించి ట్రాన్స్‌పోర్ట్ యజమాని జానీ పాషాతో పాటు అబ్దుల్ లతీఫ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. బియ్యం ఎక్కడి నుంచి తీసుకువచ్చారు? ఎక్కడికి తరలించేందుకు ఏర్పాట్లు చేశారు? ఈ అక్రమ రవాణా వెనుక మరెవరైనా ఉన్నారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ప్రభుత్వం పేదలకు అందించే ప్రజా పంపిణీ వ్యవస్థ (PDS) బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేయడం, నిల్వ చేయడం, ఇతర రాష్ట్రాలకు తరలించడం, విక్రయించడం చట్టవిరుద్ధమని టౌన్–I ఎస్‌హెచ్‌ఓ తెలిపారు. ఇలాంటి అక్రమాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పట్టుబడిన బియ్యాన్ని సంబంధిత అధికారుల సమక్షంలో తదుపరి చర్యల కోసం అప్పగించే ప్రక్రియను పోలీసులు చేపట్టారు.