అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Police Duty Meet | విధుల్లో రాణించాలంటే వృత్తి నైపుణ్యం అవసరమని సీపీ సాయిచైతన్య (CP Sai Chaitanya) అన్నారు. జోన్–2 బాసర లెవల్ పోలీస్ డ్యూటీ మీట్ -2026ను గురువారం ఆయన ప్రారంభించారు.
Police Duty Meet | విధి నిర్వహణలో సామర్థ్యం పెంచేందుకు..
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. పోలీసుల విధినిర్వహణలో సామర్థ్యం పెంచడానికి రాష్ట్రంలో మూడో పోలీస్ డ్యూటీ మీట్‌ను నిజామాబాద్‌లో ప్రారంభిస్తున్నామన్నారు. నిజామాబాద్, జగిత్యాల్, నిర్మల్, అదిలాబాద్ జిల్లాల పోలీసు అధికారులకు మీట్లో భాగంగా పోటీలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ పోటీల ద్వారా పోలీస్ విభాగంలో కానిస్టేబుల్ స్థాయి నుండి సీఐ స్థాయి వరకు పని పద్ధతులు మెరుగుపడి ఇన్వేస్టిగేషన్ స్థాయిలు పెరుగుతాయన్నారు. పనిలో పోటీతత్వం అలవాటుపడుతుందన్నారు. సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్, ఫోరెన్సిక్, ఫింగర్ ప్రింట్ ఇన్వెస్టిగేషన్ కోసం ఎంపికలో భాగంగా గురువారం ‘పోలీస్ క్లూస్’ ఏ విధంగా సేకరించాలనే దానిపై పోటీలు నిర్వహించినట్లు చెప్పారు. డ్యూటీ మీట్లో భాగంగా రెండు రోజుల పాటు పోటీలు జరుగుతాయని సీపీ పేర్కొన్నారు.
Police Duty Meet | మారుతున్న కాలానుగుణంగా..
మారుతున్న కాలానికి అనుగుణంగా చట్టాలను సైన్స్ ఇన్వెస్టిగేషన్ టూల్‌గా మార్చుకోవడం కోసం తమను తాము మెరుగుపర్చుకోవాలని సీపీ సూచించారు. ఉత్తమ ప్రతిభ కనబర్చేందుకు ఈ పోటీలు ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు డీసీపీ (అడ్మిన్) శుభం ప్రకాష్, ఏసీపీలు ప్రకాష్ యాదవ్, సీటీసీ రాజశేఖర్, సీసీఎస్ శ్రీశైలం, సీసీఆర్బీ గురు నాయుడు, టాస్క్‌ఫోర్స్ నరేందర్, డాక్టర్ నాగేంద్రబాబు, జగిత్యాల్, నిజామాబాద్, నిర్మల్, అదిలాబాద్ సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Temple Development | దేవాలయాల పరిరక్షణకు ప్రాధాన్యం : ఎమ్మెల్యే భూపతిరెడ్డి