Perini Natyam | పేరిణి నృత్య ఘట్టం..ఉత్సాహంగా నాట్య పరీక్షలు!

పేరిణి నాట్య ఆచార్యులు తోట ప్రశాంత్ - స్నేహ దంపతులు విద్యార్థులకు ఆరంభం నుంచి అత్యుత్తమ శిక్షణను అందించారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Perini Natyam | తెలంగాణ ప్రాచీన నృత్య కళారూపమైన పేరిణి శివతాండవం నిజామాబాద్ నగరంలో మరోసారి తన ఘనతను చాటుకుంది. స్థానిక విశ్వ వికాస్ హై స్కూల్ ప్రాంగణంలో ఆదివారం ఉదయం 9:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు “శ్రీ సమ్మోహన నృత్యాలయం – నిజామాబాదు” పేరిణి నాట్య విద్యార్థుల ప్రవేశిక, విశారద పరీక్షలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.

“భారత సంస్కృతీ, సంప్రదాయ కళల ప్రోత్సాహక బోర్డు”, “నటరాజ కళాకృష్ణ నృత్య జ్యోతి అకాడమీ – తెలంగాణ” సంయుక్త ఆధ్వర్యంలో ఈ పరీక్షలు జరిగాయి.

Perini Natyam | 85 మంది విద్యార్థుల నృత్య కచేరీ

ఈ శిక్షణ పరీక్షల్లో బేసిక్ లెవెల్స్ (1, 2, 3, 5) కు చెందిన సుమారు 85 మంది విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో పాల్గొన్నారు. విద్యార్థులు తమ నాట్య కౌశలాన్ని ప్రదర్శిస్తూ ప్రయోగికం (Practical), వైవా (Viva), తీయరీ (Theory) విభాగాల్లో పరీక్షలను దిగ్విజయంగా పూర్తి చేశారు. చిన్నారుల అడుగుల సవ్వడి, తాళం శబ్దాలతో పాఠశాల ప్రాంగణం మారుమోగింది.

Perini Natyam | పరీక్షాధికారులుగా ప్రముఖ నాట్యాచార్యులు

ఈ పరీక్షలకు ప్రముఖ నృత్య దిగ్గజాలు న్యాయ నిర్ణేతలుగా, పరీక్షాధికారులుగా వ్యవహరించారు. చీఫ్ ఎగ్జామినర్​గా గురుశ్రీ పేరిణి ప్రవీణ శ్రీ గజ్జెల రంజిత్ కుమార్, ఎక్స్‌టర్నల్ ఎగ్జామినర్​గా సూర్యాపేటకు చెందిన ప్రముఖ నాట్య గురువు, పేరిణి రుద్ర శ్రీ M. శ్రీకాంత్, ఇంటర్నల్ ఎగ్జామినర్స్​గా వరంగల్ నుంచి విచ్చేసిన పేరిణి నాట్య అధ్యాపకులు పల్నాటి శ్రీజ, బండారి తేజస్విని, గడ్డం విద్యాశ్రీ బాధ్యతలు నిర్వర్తించారు.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

Perini Natyam | నట్టువంగంతో ప్రోత్సాహం

శ్రీ సమ్మోహన నాట్యాలయం నిర్వాహకులు, స్థానిక ప్రముఖ పేరిణి నాట్య ఆచార్యులు తోట ప్రశాంత్ – స్నేహ దంపతులు విద్యార్థులకు ఆరంభం నుంచి అత్యుత్తమ శిక్షణను అందించారు. ఈ పరీక్షల సమయంలో ప్రత్యక్షంగా నట్టువంగం వేస్తూ విద్యార్థుల నృత్య రీతులకు అనుగుణంగా ప్రోత్సహించి, కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

తల్లిదండ్రుల ఆనందం

చిన్నతనం నుంచే పిల్లలకు భారతీయ సంస్కృతి, సంప్రదాయ కళలపై ఆసక్తి కలగడం, పేరిణి నాట్యంలో మంచి ప్రవేశం, గుర్తింపు లభించడం పట్ల విద్యార్థుల తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. ప్రతిభ చాటిన విద్యార్థులను, వారిని తీర్చిదిద్దిన నాట్యాచార్యులను నిర్వాహకులు అభినందించారు.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *