Tree Cutting Fine | అనుమతులు లేకుండా చెట్ల నరికివేత.. కాంట్రాక్టర్‌కు రూ.8 వేల జరిమానా

చెట్లను తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడితే ముందుగానే సంబంధిత శాఖల నుంచి తప్పనిసరిగా అనుమతులు పొందాలని సూచించారు.

Naresh Chandan

అక్షరటుడే, నందిపేట్: Tree Cutting Fine | నిజామాబాద్​ Nizamabad జిల్లా నందిపేట్ ప్రాంతంలో అనుమతులు లేకుండా రెండు కానుగ చెట్లను నరికివేసిన కాంట్రాక్టర్‌కు అటవీశాఖ అధికారులు రూ.8 వేల జరిమానా విధించారు. భవిష్యత్తులో సంబంధిత శాఖల అనుమతులు లేకుండా చెట్లను నరికితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

Tree Cutting Fine | అనధికారికంగా..

నందిపేట్‌లోని అగ్నిమాపక శాఖ ఆవరణలో కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. నిర్మాణ పనులకు రెండు కానుగ చెట్లు అడ్డుగా ఉన్నాయని పేర్కొంటూ, ఎలాంటి ముందస్తు అనుమతులు తీసుకోకుండానే వాటిని నరికివేశారు.

విషయాన్ని తెలుసుకున్న అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని కాంట్రాక్టర్‌ను విచారించారు. చెట్ల నరికివేతకు ఎలాంటి అనుమతి తీసుకోలేదని కాంట్రాక్టర్ అంగీకరించినట్లు అధికారులు తెలిపారు. దీంతో అటవీశాఖ చట్టాలు, వాల్టా (WALTA) నిబంధనల ప్రకారం చర్యలు తీసుకుని రూ.8 వేల జరిమానా విధించారు.

Balkonda DCM Accident | వరద కాలువలో డీసీఎం వ్యాన్ బోల్తా.. డ్రైవర్ దుర్మరణం

Tree Cutting Fine | అనుమతులు తప్పనిసరి

ఈ సందర్భంగా అటవీశాఖ రేంజ్ ఆఫీసర్ అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. చెట్లను తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడితే ముందుగానే సంబంధిత శాఖల నుంచి తప్పనిసరిగా అనుమతులు పొందాలని సూచించారు. అనుమతులు లేకుండా చెట్లను నరికితే చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు భారీగా జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు.

నిర్మాణ పనుల పేరుతో చెట్లను ఇష్టానుసారంగా తొలగించకుండా నిబంధనలను పాటించాలని ఆయన స్పష్టం చేశారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెట్ల నరికివేతపై అటవీశాఖ నిఘా కొనసాగుతుందని తెలిపారు.

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *