Nandipet Police Station | పోలీస్ స్టేషన్​లో ప్రజలకు స్నేహపూర్వక వాతావరణం కల్పించాలి: సీపీ సాయిచైతన్య

పోలీస్ స్టేషన్​లో ప్రజలకు స్నేహపూర్వక వాతావరణం కల్పించాలని సీపీ సాయిచైతన్య పేర్కొన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే,నందిపేట్: Nandipet Police Station | పోలీస్ స్టేషన్​లో ప్రజలకు స్నేహపూర్వక వాతావరణం కల్పించాలని సీపీ సాయిచైతన్య (CP Saichaitanya) పేర్కొన్నారు. ఈ మేరకు ఆర్మూర్(Armoor) డివిజన్ పరిధిలోని నందిపేట్​ పోలీస్​స్టేషన్​లో గురువారం ఆర్మూర్​ డివిజన్​ స్థాయి సమావేశాన్ని నిర్వహించారు.

Nandipet Police Station | డ్రగ్స్​, గంజాయి నిర్మూలనకు నిఘా పెట్టాలి..

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ..గంజాయి,డ్రగ్స్​ అక్రమ రవాణాలో పాల్గొనే వారిపై పీడీ యాక్ట్ నమోదు చేయాలని ఆదేశించారు. సైబర్ నేరాలపై ప్రజలలో అవగాహన కల్పించాలన్నారు. ఆన్​లైన్ మోసాలకు గురైన బాధితులకు వెంటనే స్పందించి సహాయం అందించాలని.. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు రెచ్చగొట్టే పోస్టులపై కఠినచర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఆర్మూర్ డివిజన్ పరిధిలో నమోదైన వివిధ రకాల కేసులపై సమగ్రంగా చర్చించారు. ముఖ్యంగా హత్యా, హత్యాయత్నం, చోరీలు మహిళలపై నేరాలు, సైబర్, మోసాలు డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణా, పేకాట, గుట్కా అక్రమ వ్యాపారంపై స్టేషన్​ అధికారులతో వివరాలు రాబట్టారు.

పెండింగ్​లో ఉన్న కేసులు వేగవంతంగా పూర్తి చేసి బాధితులకు త్వరిత న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రాబోయే పండుగ నేపథ్యంలో బందోబస్తు ఏర్పాటును పటిష్టంగా నిర్వహించాలని వాహనాలను 24/7 తనిఖీలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి, సీసీఆర్​బీ ఏసీపీ గురు నాయుడు, సీసీఆర్​బీ ఇన్​స్పెక్టర్​ అంజయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్​స్పెక్టర్​ శ్రీధర్ రెడ్డి, సీఐలు, ఎస్​హెచ్​వోలు, ఎస్సై వినయ్​, ఐటీ కోర్​ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Nandipet Police Station, CP Saichaitanya, Nizamabad Police, Nandipet News, Cyber Crime, Drug Control, Police Inspection, Telangana Police

ఇది కూడా చదవండి: RI Caught by ACB | లంచం తీసుకుంటూ దొరికిన ఆర్​ఐ

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *