అక్షర టుడే, బాల్కొండ: Balkonda DCM Accident | నిజామాబాద్ Nizamabad జిల్లా బాల్కొండ శివారులోని వరద కాలువపై ఉన్న బ్రిడ్జి వద్ద డీసీఎం వ్యాన్ అదుపుతప్పి కాలువలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ మృతి చెందాడు. మృతుడిని మహారాష్ట్రలోని కిణ్వట్‌కు చెందిన సుదామ్ సఖారాం కఠాడే (32)గా పోలీసులు గుర్తించారు.
Balkonda DCM Accident | ఆదిలాబాద్ నుంచి వస్తుండగా..
బాల్కొండ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సుదామ్ సఖారాం బుధవారం ఉదయం ఆదిలాబాద్ నుంచి పైపుల లోడ్‌తో హైదరాబాద్‌కు బయలుదేరాడు. మార్గమధ్యలో నేరడిగొండ వద్ద డీసీఎం డీజిల్ ట్యాంక్‌లో సమస్య ఏర్పడటంతో మరమ్మతు చేయించుకుని గురువారం ఉదయం తిరిగి ప్రయాణం కొనసాగించాడు.
ఈ క్రమంలో బాల్కొండ శివారులో వరద కాలువపై ఉన్న బ్రిడ్జి వద్ద డివైడర్‌ను డీసీఎం ఢీకొని పల్టీలు కొడుతూ కాలువలో పడిపోయింది. ప్రమాద తీవ్రతకు డ్రైవర్ క్యాబిన్‌లో ఇరుక్కుపోయి అక్కడికక్కడే మృతి చెందాడు.
Balkonda DCM Accident | క్రేన్ సాయంతో ప్రయత్నం..
సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ సహాయంతో వాహనాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నించినప్పటికీ వెంటనే సాధ్యం కాలేదు. మృతుడి వద్ద లభించిన ఆధార్ కార్డు ఆధారంగా అతడిని సుదామ్ సఖారాం కఠాడేగా గుర్తించారు.
మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు బాల్కొండ పోలీసులు తెలిపారు.