Cheeta Force Nizamabad | వ్యభిచార గృహంపై చీతా ఫోర్స్ మెరుపు దాడి

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Cheeta Force Nizamabad | నిజామాబాద్ పోలీస్​​ కమిషనరేట్​ (Nizamabad Police Commissionerate) పరిధిలో వ్యభిచార గృహంపై చీతా ఫోర్స్​ మెరుపు దాడి (Cheeta Force Raid) చేసింది. ఈ క్రమంలో పలువురిని అదుపులోకి తీసుకున్నారు. సీసీఎస్​ ఇన్​ఛార్జి ఏసీపీ మస్తాన్​అలీ ఆదివారం వివరాలు వెల్లడించారు.

Cheeta Force Nizamabad | నాల్గో టౌన్​ పరిధిలో..

సీసీఎస్​ ఇన్​ఛార్జి ఏసీపీ (CCS Police Action) తెలిపిన వివరాల ప్రకారం.. నాల్గో టౌన్​ పరిధిలో వ్యభిచారం జరుగుతోందనే పక్కా సమాచారం మేరకు వినాయక్​నగర్​లోని (Vinayak Nagar) ఓ ఇంటిపై చీతాఫోర్స్​ సిబ్బంది దాడులు చేశారు. దాడిలో ఐదుగురు మహిళలు, ముగ్గురు పురుషులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే రూ.4,870 నగదు, ఏడు ఫోన్లు, స్వాధీనం చేసుకున్నారు. అనంతరం తదుపరి చర్యల నిమిత్తం వారిని నాల్గో టౌన్​ ఎస్​హెచ్​వోకు అప్పగించినట్లు సీసీఎస్​ ఇన్​ఛార్జి ఏసీపీ మస్తాన్​ అలీ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Paddy Procurement Review | నెలాఖరులోగా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలి : డిప్యూటీ సీఎం

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *