నిజామాబాద్Cheeta Force Raids | పీడీఎస్​ అక్రమ నిల్వలపై చీతా ఫోర్స్​ దాడులు

Cheeta Force Raids | పీడీఎస్​ అక్రమ నిల్వలపై చీతా ఫోర్స్​ దాడులు

నిజామాబాద్ పోలీస్​ కమిషనరేట్ పరిధిలో పీడీఎస్ బియ్యం అక్రమ నిల్వలపై చీతా ఫోర్స్​ దాడులు చేసింది. సీసీఎస్​ ఏసీపీ ఇన్​ఛార్జి మస్తాన్ అలీ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది నగరంలోని మూడు ప్రాంతాల్లో డంప్​లపై దాడులు నిర్వహించారు.

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Cheeta Force Raids | నిజామాబాద్ పోలీస్​ కమిషనరేట్ (Nizamabad Police Commissionerate) పరిధిలో పీడీఎస్ బియ్యం అక్రమ నిల్వలపై చీతా ఫోర్స్(Cheeta Force)​ దాడులు చేసింది. సీసీఎస్ (CCS Nizamabad)​ ఏసీపీ ఇన్​ఛార్జి మస్తాన్ అలీ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది నగరంలోని మూడు ప్రాంతాల్లో డంప్​లపై దాడులు నిర్వహించి బియ్యంను స్వాధీనం చేసుకున్నారు.

Cheeta Force Raids | నాల్గో పోలీస్ స్టేషన్ పరిధిలో..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని నాల్గో పోలీస్ స్టేషన్ పరిధిలోని రిలయన్స్ షాపింగ్ మాల్ వద్ద రోడ్డుపై అనుమానాస్పదంగా వెళ్తున్న డీసీఎంను పోలీసులు తనిఖీ చేశారు. దీంట్లో అక్రమంగా తరలిస్తున్న సుమారు 30 క్వింటాళ్ల పీడీఎస్​ రైస్​ను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నాల్గోటౌన్ పోలీస్ స్టేషన్​ ఎస్​హెచ్​వోకు అప్పగించారు. వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ముజాహిద్ నగర్ కాలనీలో పక్కా సమాచారం మేరకు అబ్దుల్ అల్తాఫ్ ఇంటిపై దాడి చేసి ఆరు క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే రెండో పోలీస్ స్టేషన్ పరిధిలోని ముస్తాహిద్​పురా కాలనీలో సయ్యద్ సాజిద్ అలీ ఇంటిపై దాడిచేసి రెండు క్వింటాళ్ల పీడీఎస్​ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని ఎస్​హెచ్​వోకు అప్పగించారు. ఈ ఘటనలపై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

ఇది కూడా చదవండి : Bullion Bank India | ప్రత్యేక ‘బులియన్ బ్యాంక్’ ఏర్పాటుపై కేంద్రం కసరత్తు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Car Accident | అదుపుతప్పి కారుబోల్తా.. వైద్యుడికి గాయాలు..

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Car Accident | కారు అదుపు తప్పి...

India Nordic Summit | ఇండియా – నార్డిక్​ సమ్మిట్​లో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : India Nordic Summit | విదేశీ పర్యటనలో...

Friendly Policing | ఫ్రెండ్లీ పోలీసింగ్​పై అధికారులు బాధ్యతగా వ్యవహరించాలి : సీపీ సాయిచైతన్య

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Friendly Policing | ప్రజలకు ఫ్రెండ్లీ పోలీసింగ్​...

Khammam CI Harassment | మహిళపై సీఐ లైంగిక వేధింపులు.. కేసు నమోదు

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Khammam CI Harassment | రక్షణ కల్పించాల్సిన...