Farmers Protest | కొనుగోలు కేంద్రాల కోసం రోడ్డెక్కిన రైతన్న..

Balla Sandeep Kumar

అక్షరటుడే, గాంధారి: Farmers Protest | ప్రభుత్వం మొక్కజొన్న, జొన్న కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్​ చేస్తూ రైతులు రోడ్డెక్కారు. గాంధారి మండల (Gandhari Mandal) కేంద్రంలో బాన్సువాడ (Banswada) గాంధారి రహదారిపై వారు సోమవారం మహాధర్నా నిర్వహించారు.

Farmers Protest | అధికారులకు విన్నవించినా నిర్లక్ష్యమేనా..

ఈ సందర్భంగా భారతీయ కిసాన్ సంఘ్ (Bharatiya Kisan Sangh) సభ్యులు మాట్లాడుతూ ఇదివరకే తహశీల్దార్​, మార్క్​ఫెడ్​ అధికారులకు, కలెక్టర్​కు వినతి పత్రాలు అందించామని.. అయినప్పటికీ ఎలాంటి ఉపయోగం లేదన్నారు. దీంతో గతిలేని స్థితిలో రోడ్డుపై ధర్నా చేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలు ఉంటాయన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన మొక్కజొన్న పంటకు ప్రభుత్వం ధర రూ.2,400 నిర్ణయిస్తే.. దళారులు రూ.1,700 నుంచి కొనుగోలు చేస్తున్నారని వివరించారు. అంతేకాకుండా జొన్నకు ప్రభుత్వం రూ.3,700 ఉండగా దళారులు రూ.2,600 కొనుగోలు చేస్తున్నారని వాపోయారు.

Farmers Protest

ఇది కూడా చదవండి..: KCR Jagtial Meeting | నేడు జగిత్యాలకు గులాబీ బాస్​.. ఏడాది తర్వాత కేసీఆర్​ సభ

Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *