నిజామాబాద్Naikapod Population | నాయక్​పోడ్​ జనాభాను తక్కువ చేసి చూపించడం సరికాదు..

Naikapod Population | నాయక్​పోడ్​ జనాభాను తక్కువ చేసి చూపించడం సరికాదు..

ప్రభుత్వం నాయక్​పోడ్​ జనాభాను తక్కువ చేసి చూపించడం సరికాదని.. ఆదివాసి నాయకపోడ్​ సేవా సంఘం అధ్యక్ష,కార్యదర్శులు గాండ్ల రాంచందర్​, పుట్ట శివశంకర్​ అన్నారు. ఈ మేరకు కలెక్టర్​లోని ప్రజావాణిలో అధికారులకు వినతిపత్రం అందజేశారు.

అక్షరటుడే, ఇందూరు: Naikapod Population | ప్రభుత్వం నాయక్​పోడ్​ జనాభాను తక్కువ చేసి చూపించడం సరికాదని..ఆదివాసి నాయకపోడ్​ సేవా సంఘం (Nayakapod Seva sangham) అధ్యక్ష, కార్యదర్శులు గాండ్ల రాంచందర్​, పుట్ట శివశంకర్​ పేర్కొన్నారు. ఈ మేరకు కలెక్టర్​లోని ప్రజావాణిలో (Prajavani) అధికారులకు వినతిపత్రం అందజేశారు.

Naikapod Population | నాయక్​పోడ్​లను అవమానించడమే..

అనంతరం సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ.. ఆదివాసి నాయక పోడ్​ జనాభాను తక్కువ చేసి చూపించడం సరైంది కాదని.. ఇది తమను అవమానించడమేనని వారు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జనాభా వివరాలలో నాయకపోడ్​ తెగ జనాభాను కేవలం 16 వేలుగా చూపడం ఎంతవరకు కరెక్ట్​ అని ప్రశ్నించారు. 1949లో షెడ్యూల్ తెగ జాబితాలో 9 తెగలను గుర్తించగా.. అందులో నాయక్​పోడ్​ తెగ ఒకటన్నారు. అలాంటి తెగను జనాభా లెక్కల్లో తక్కువ చేసి చూపించడం ద్వారా మా జాతి అస్తిత్వం, సంస్కృతి సంప్రదాయాలను నిర్లక్ష్యం చేశారని వారు పేర్కొన్నారు.

Naikapod Population | ఆరు లక్షలకు పైగా ఉన్న జనాభా..

రాష్ట్రవ్యాప్తంగా ఆరు లక్షలకు పైగా ఉన్న నాయక్​పోడ్​లను కేవలం 16వేలుగా చూపించడంపై తాము నిరసన వ్యక్తం చేస్తున్నామన్నారు. అంతేకాకుండా నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో 29 మండలాల్లో నాయక్​పోడ్​ తెగ కుటుంబాలు సుమారు 4,392 మంది ఉండగా.. జనాభా 35వేలకు పైగా ఉందన్నారు. త్వరలో జరిగే జనగణనలో తమకు సముచిత స్థానం కల్పించాలన్నారు. జనగణనలో తమకు ప్రత్యేకంగా కాలమ్​ ఏర్పాటు చేయాలని వారు డిమాండ్​ చేశారు.

kotak11

ఇది కూడా చదవండి: Kavitha New Party | నా పార్టీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ : కవిత

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Harish Rao TRS row | TRS పేరుతో హరీష్ రావు సొంత పార్టీ!..ఇది కొత్త వ్యూహమా..?

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Harish Rao TRS row | తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికర...

Sridip Success Story | తండ్రి మరణంతో కన్నీటి చుక్కలు రాసిన అక్షరాల విజయగాథ!

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Sridip Success Story | పరీక్ష హాలులో ప్రశ్నపత్రాన్ని...

SRH Powerplay Score | SRH ఊచకోత.. MI బౌలర్లపై విరుచుకుపడ్డ ఓపెనర్లు.. పవర్‌ప్లేలోనే మ్యాచ్ మలుపు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH Powerplay Score | ఐపీఎల్‌లో మరోసారి రన్‌ఫెస్ట్‌కు...

Pallikonda Theft Case | పల్లికొండలో దొంగల హల్​చల్​.. ఐదు తులాల బంగారం దోపిడీ..

అక్షరటుడే, భీమ్​గల్: Pallikonda Theft Case | దొంగలు హల్​చల్​ చేశారు....