Harish Rao Delhi Tour | బీఆర్​ఎస్​లో ముసలం.. కాంగ్రెస్​ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Harish Rao Delhi Tour | కాంగ్రెస్​ ఎంపీ చామల కిరణ్ ​కుమార్​రెడ్డి (Chamala Kiran Kumar Reddy) బీఆర్​ఎస్​పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీలో ముసలం మొదలైందన్నారు. అందుకే మాజీ మంత్రి హరీశ్​రావు ఢిల్లీకి వెళ్లారని ఆరోపించారు.

పార్టీ ఫిరాయింపులు, కాళేశ్వరం కేసుల నేపథ్యంలో న్యాయపరమైన చర్చల కోసం బీఆర్ఎస్ త్రిసభ్య బృందం ఢిల్లీ (Delhi)కి చేరుకున్న విషయం తెలిసిందే. ఈరోజు సాయంత్రం ఢిల్లీలో సీనియర్ న్యాయవాదులతో హరీష్‌రావు, వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర సమావేశం కానున్నారు. కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission)​ నివేదికపై ఎల్లుండి హైకోర్టులో తీర్పు రానుంది. తీర్పు వ్యతిరేకంగా వస్తే సుప్రీంకోర్టులో పిటిషన్ వేసేందుకు బీఆర్​ఎస్​ సిద్ధం అవుతోంది. ఈ క్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు ఢిల్లీలో సీనియర్​ న్యాయవాదులతో చర్చించనున్నారు. అయితే ఆయన ఢిల్లీ పర్యటనపై కాంగ్రెస్​ ఎంపీ వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారి తీశాయి.

Harish Rao Delhi Tour | మునిగిపోయే పడవ

ఎంపీ చామల కిరణ్​ కుమార్​ రెడ్డి మాట్లాడుతూ.. హరీశ్‌రావు ఢిల్లీ పర్యటన వెనుక రాజకీయ అంతరార్థం ఉందన్నారు. పార్టీలో ముసలం మొదలైందన్నారు. మాజీ మంత్రి జీవన్‌రెడ్డి (Jeevan Reddy) చేరిక హరీశ్‌రావుకు ఇష్టం లేదని, అందుకే కేసీఆర్ సభకు ఆయన గైర్హాజరయ్యారని విమర్శించారు. బీఆర్ఎస్ మునిగిపోయే పడవ అని ఎద్దేవా చేశారు. హరీశ్ రావు భవిష్యత్తు ప్రణాళికలు త్వరలోనే బయటపడతాయని చామల వ్యాఖ్యానించారు. కాగా కేసీఆర్​ దాదాపు ఏడాది తర్వాత బహిరంగ సభకు హాజరు అవుతున్నారు. అలాంటి సమయంలో హరీశ్​రావు లేకపోవడంతో రాజకీయ వర్గాల్లో సైతం తీవ్ర చర్చ జరుగుతోంది. అయితే కేసీఆర్​ ఆదేశాల మేరకే ఆయన ఢిల్లీ వెళ్లారని బీఆర్​ఎస్​ వర్గాలు చెబుతున్నాయి.

mp kiran

దీనిని కూడా చదవండి : Kavitha New Party | నా పార్టీలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ : కవిత

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *