Vikas Eye Surgery | సీఎం గారు.. వికాస్ కళ్లల్లో వెలుగులు నింపరూ..?

రేవంత్​రెడ్డి ఇచ్చిన హామీ అమలు కోసం ఆ అంధ బాలుడు ఎదురుచూస్తున్నాడు.

shashi kiran Mottala

అక్షరటుడే గాంధారి: Vikas Eye Surgery | రేవంత్​రెడ్డి ఇచ్చిన హామీ అమలు కోసం ఆ అంధ బాలుడు మూడేళ్లుగా ఎదురుచూస్తున్నాడు.. తన చూపు కోసం ఆపరేషన్​ చేయిస్తానని రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) హామీ ఇవ్వడంతో.. ఆయనెప్పుడు స్పందించి తనకు చూపు తెప్పిస్తారా అంటూ బాలుడు వేచి చూస్తున్నాడు..

Vikas Eye Surgery | ​ పాదయాత్రలో..

కాంగ్రెస్ పాదయాత్ర సందర్భంగా 2023 మార్చిలో గాంధారి(Gandhari) మండలంలో నిరుద్యోగ నిరసన దీక్ష జరిగింది. ఈ దీక్షలో అంధ బాలుడు వికాస్ పాడిన పాటకు అప్పటి పీసీసీ చీఫ్, ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి ముగ్ధులయ్యారు. కాంగ్రెస్ నాయకుడు వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ద్వారా సభావేదికపైనే రూ.లక్ష నగదు అందజేశారు. వికాస్‌కు కంటి ఆపరేషన్(Eye Surgery Support) చేయిస్తానని, ఇందిరమ్మ ఇల్లు ఇస్తానని నాడు రేవంత్ రెడ్డి తల్లిదండ్రులకు భరోసా ఇచ్చారు. కానీ రేవంత్ రెడ్డి సీఎం అయి రెండేళ్లు గడుస్తున్నా ఆ హామీలు అమలుకు నోచుకోలేదని వికాస్ తల్లిదండ్రులు కవిత, లక్ష్మణ్ వాపోతున్నారు.

Vikas Eye Surgery | గాంధారి మండలం లొంక తండా..

కామారెడ్డి (Kamareddy) జిల్లా గాంధారి మండలం లొంక తండాకు చెందిన వికాస్ రెండేళ్ల వయసులోనే చూపు కోల్పోయాడు. 15 ఏళ్ల వయసులోనే “అన్నా మా రైతు అన్న..” అనే పాటతో కోట్లాది మంది మనసులు గెలుచుకున్నాడు. ఒకే ఒక్కపాట ద్వారా కొన్ని కోట్ల మంది ఆదరాభిమానాలను చూరగొని అందరి మదిలో చెరగని ముద్ర వేసుకున్నాడు. వికాస్​ చాలా పాటలు పాడినప్పటికీ రైతులపై పాడిన ఒక్కపాట రైతన్న పడుతున్న శ్రమను కళ్లకు కట్టినట్టు చేసింది. ‘అన్నా మా రైతు అన్న’ పేరుతో ఉన్న ఈ పాట కోట్లలో వ్యూస్​ సాధించింది.

​Vikas Eye Surgery | వెన్నుతట్టిన సినీ నటుడు సోనూసూద్

సోనూసూద్ వికాస్ ప్రతిభను చూసి ప్రత్యేకంగా ఆల్బమ్ పాట పాడించడంతో అది అనేకమందికి గుండెలను హత్తుకుంది. సోను సూద్ కూడా నగదు రూపంలో సాయం చేశాడు. కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని కూడా వికాస్​ తల్లిదండ్రులు కలవగా జగ్గారెడ్డి కూడా తనవంతు సాయంగా నగదు అందజేశారు. అయితే వికాస్ కంటి ఆపరేషన్​కు డబ్బు ఎక్కువగా అవసరం ఉండడం.. సీఎం హామీ ఇవ్వడంతో ఆయన ఇచ్చిన హామీ అమలు కోసం అతడి తల్లిదండ్రులు కవిత లక్ష్మణ్ ఎదురు చూస్తున్నారు

Vikas Eye Surgery | హామీ అమలు కోసం ఎదురుచూపులు..

సీఎం క్యాంప్ ఆఫీస్ చుట్టూ ఎన్నోసార్లు తిరిగామని వికాస్​ తల్లిదండ్రులు కవిత లక్ష్మణ్​ పేర్కొన్నారు. అప్పటి పీసీసీ చీఫ్​.. ప్రస్తుత సీఎం రేవంత్​రెడ్డి కంటిచూపు కోసం సాయం చేస్తామని హామీ ఇచ్చారన్నారు. సీఎం స్పందించి వికాస్​కు కంటి ఆపరేషన్లు చేయించి తమ కుమారుడి కళ్లల్లో వెలుగులు నింపాలని కోరుతున్నారు.

vikas

ఇది కూడా చదవండి: #VenkyAnil5, #NKRAR2 మూవీ షూటింగ్ లో డైరెక్టర్ అనిల్ రావిపూడి వేగంగా దూసుకుపోతున్నారు. 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *