Resonance Academy | అనుమతుల్లేని ‘రెసోనెన్స్ అకాడమీ’ని నమ్మి మోసపోవద్దు..

shashi kiran Mottala

అక్షరటుడే,​ నిజామాబాద్ సిటీ: Resonance Academy | నిజామాబాద్​ జిల్లాలో ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా నిర్వహిస్తున్న ‘రెసోనెన్స్ ఐఐటీ ఫౌండేషన్, నీట్ అకాడమీ’ని (NEET Academy) నమ్మి విద్యార్థులు, తల్లిదండ్రులు మోసపోవద్దని జిల్లా విద్యార్థి సంఘాల నాయకులు (Nizamabad Education) హెచ్చరించారు. ఈ సంస్థపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకొని సీజ్ చేయాలని ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు.

Resonance Academy | జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఫిర్యాదు..

ఈ మేరకు గురువారం జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో (DEO Nizamabad) అధికారికి విద్యార్థి సంఘాల నాయకులు వినతిపత్రం అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. 6 నుంచి 10వ తరగతి వరకు స్టడీ సెంటర్ పేరుతో ఈ అకాడమీ ఏర్పాటు కోసం నగరంలోని ఓ ఇంటర్నేషనల్ హోటల్‌లో ప్రారంభ కార్యక్రమం ఏర్పాట్లు చేశారన్నారు. ఎలాంటి అనుమతులు లేని ఈ సంస్థ ప్రచారానికి మాజీ ఐపీఎస్ అధికారి ముఖ్య అతిథిగా రావడం ఆశ్చర్యకరంగా ఉందన్నారు.

students 1

Resonance Academy | విద్యార్థుల తల్లిదండ్రులకు తప్పుడు సంకేతాలు..!

సమాజంలో ఆదర్శంగా ఉండే ప్రముఖులు సంస్థల అనుమతుల గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత ఉందని.. ​ఇలాంటి సంస్థల వల్ల భవిష్యత్​లో విద్యార్థులకు భద్రతాపరమైన సమస్యలు వస్తే బాధ్యులెవరో తెలియక తల్లిదండ్రులు నష్టపోతారని వారన్నారు.

​జిల్లా విద్యాశాఖ తక్షణమే స్పందించి ఈ అకాడమీని సీజ్ చేయకపోతే, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని నాయకులు స్పష్టం చేశారు. టీఎస్ఏ, టీఎస్​ఎఫ్​, బీసీ విద్యార్థి సంఘం, టీఎన్​ఎస్​ఎఫ్, బీసీవీఎస్​ ​నాయకులు కిరణ్, మహేష్, ప్రతాప్, యూసుఫ్, జ్వాల, శ్రీను తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: Ponguleti Key Comments | ఏ శాఖ ఇచ్చిన పని చేస్తా.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *