నిజామాబాద్Tractor Accident | మొక్కులు తీర్చుకుని వస్తుండగా విషాదం.. ట్రాక్టర్ బోల్తాపడి ఇంటర్​ విద్యార్థిని దుర్మరణం

Tractor Accident | మొక్కులు తీర్చుకుని వస్తుండగా విషాదం.. ట్రాక్టర్ బోల్తాపడి ఇంటర్​ విద్యార్థిని దుర్మరణం

రామారెడ్డి మండల కేంద్రంలో చెరువు కట్టపై నుంచి అదుపు తప్పి ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఓ యువతి మృతి చెందింది.

అక్షరటుడే, కామారెడ్డి: Tractor Accident | అదుపు తప్పి చెరువు కట్టపై నుంచి ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటన రామారెడ్డి మండల (Ramareddy Mandal) కేంద్రంలో ఆదివారం రాత్రి చోటుచేసుకోగా ఓ యువతి మృతి చెందింది.

Tractor Accident | చెరువు కట్టపై..

రామారెడ్డి మండల కేంద్రానికి చెందిన నర్సింలు కుటుంబం గ్రామ సమీపంలోని బీరప్ప ఆలయం వద్ద పండగ చేసి మొక్కులు చెల్లించుకున్నారు. వీరంతా రామారెడ్డి నుంచి బీరప్ప ఆలయం వద్దకు కుటుంబ సభ్యులు, బంధువులతో కలిసి ట్రాక్టర్​లో వెళ్లారు. పండగ పూర్తయ్యాక రాత్రి సమయంలో తిరిగి ట్రాక్టర్​లో ఇంటికి బయలుదేరారు. ఈ క్రమంలో ట్రాక్టర్ పటేల్ చెరువు కట్టపై నుంచి అదుపుతప్పి కిందకు బోల్తా పడింది.

Tractor Accident | కుటుంబ సభ్యులకు తీవ్రగాయాలు..

ఈ ఘటనలో ట్రాక్టర్ డ్రైవర్, అతని భార్య, కూతురికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని చికిత్స నిమిత్తం కామారెడ్డికి, అక్కడినుంచి మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ తరలించారు. అయితే చికిత్స పొందుతూ ట్రాక్టర్ డ్రైవర్ నర్సింలు కూతురు శ్రావ్య(17) మృతి చెందింది. ప్రస్తుతం శ్రావ్య ఇంటర్ మీడియట్ చదువుతున్నట్టుగా తెలుస్తోంది. ప్రమాదంతో రామారెడ్డి గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

ఇది కూడా చదవండి..: Santhosh Reddy Wife | మాజీ మంత్రి భార్య మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Kamareddy Train Accident | రైలు ఢీకొని గొర్లు మృతి..

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Train Accident | రైలు ఢీకొని గొర్లు...

Samantha Fan Proposal | మా ఇంటి బంగారం ఈవెంట్‌లో సమంతకు ఫ్యాన్ ప్రపోజల్.. స్టేజ్‌పై జరిగిన ఘటన వైరల్

అక్షరటుడే, వెబ్​డెస్క్: Samantha Fan Proposal | స్టార్ హీరోయిన్ సమంత...

Working Women Safety | వర్కింగ్ ఉమెన్ భద్రత ప్రభుత్వ బాధ్యత : మంత్రి సీతక్క

అక్షరటుడే, వెబ్​డెస్క్: Working Women Safety | హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్...

Odisha Septic Tank Tragedy | ఒడిశాలో విషాదం.. సెప్టిక్ ట్యాంక్ శుభ్రం చేస్తూ ఆరుగురు కూలీల మృతి

అక్షరటుడే, వెబ్‌డెస్క్: Odisha Septic Tank Tragedy | ఒడిశాలోని కలహండి...