DEE caught by ACB | ‘డబుల్’ ఇళ్ల బిల్లుల కోసం లంచం.. ఏసీబీకి చిక్కిన డీఈఈ

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్ : DEE caught by ACB | అవినీతి అధికారులు మారడం లేదు. నిత్యం ఏసీబీ దాడులు (ACB Raids) జరుగుతున్నా.. లంచాలకు మరిగిన అధికారులు భయపడటం లేదు. ప్రజలు, కాంట్రాక్టర్ల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. తాజాగా ఓ డీఈఈ ఏసీబీ అధికారులకు రెడ్​ హ్యాండెడ్​గా దొరికాడు.

వరంగల్​ జిల్లా (Warangal District) సాగునీటి మరియు ఆయకట్టు అభివృద్ధి శాఖ (I&CAD) కార్యాలయం డివిజనల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గంటి శ్రీకాంత్ ప్రస్తుతం పాలకుర్తిలో DEగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఓ వ్యక్తి నుంచి రూ.50 వేలు లంచం తీసుకుంటుండగా.. సోమవారం ఏసీబీ అధికారులు ఆయనను వల పన్ని పట్టుకున్నారు. అనంతరం కార్యాలయం, ఇంట్లో సోదాలు చేశారు. కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

DEE caught by ACB

DEE caught by ACB | కొలతలు తీసుకోవడానికి..

పాలకుర్తి పరిధిలో ఓ వ్యక్తి 10 డబుల్​ బెడ్​ రూం ఇళ్లను నిర్మించాడు. ఆ బిల్లుల కోసం ఏళ్లుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. ఇళ్ల నిర్మాణానికి సంబంధించిన తుది కొలతలను నమోదు చేసి, బిల్లులను ప్రాసెస్ చేయాల్సి ఉండగా.. డీఈఈ గంటి శ్రీకాంత్ ఈ పనిని అతను సెప్టెంబర్ 2022 నుండి పెండింగ్‌లో ఉంచాడు. అంతేగాకుండా పని పూర్తి చేయడానికి రూ.50 వేల లంచం డిమాండ్​ చేశాడు.

DEE caught by ACB | విసిగిపోయి..

సదరు అధికారి తీరుతో విసిగిపోయిన బాధితుడు ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. ఈ మేరకు ఫిర్యాదుదారుడి నుంచి సోమవారం రూ.50 వేల లంచం తీసుకుంటుండగా డీఈఈ శ్రీకాంత్​ను ఏసీబీ అధికారులు రెడ్​ హ్యాండ్​డెగ్​ పట్టుకున్నారు.

DEE caught by ACB | లంచం ఇవ్వొద్దు

ప్రభుత్వ అధికారులకు లంచం ఇవ్వొద్దని ఏసీబీ అధికారులు సూచిస్తున్నారు. ఎవరైనా లంచం అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని కోరారు. ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064, వాట్సాప్ నంబర్​ 9440446106 లో ఫిర్యాదు చేయవచ్చని వివరించారు. వెబ్​సైట్​ ద్వారా కంప్లైట్​ చేయొచ్చని పేర్కొన్నారు. ఫిర్యాదుదారుల వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు.

DEE caught by ACB

ఇది కూడా చదవండి..: Warangal Sub Registrar ACB | అవినీతి పుట్ట.. సబ్ రిజిస్ట్రార్ ఇంట్లో నోట్ల కట్టలు, భారీగా బంగారం!

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *